Oil Palm Cultivation: ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా సబ్సిడీ..

Oil Palm Cultivation: భారత దేశంలో వంట నూనె వినియోగం ఎక్కువ..ఈ నేపథ్యంలో వంట నూనె కోసం విదేశాల నుంచి పామాయిల్ గింజలను దిగుమతి..

Oil Palm Cultivation: ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా సబ్సిడీ..
Oil Palm
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 16, 2021 | 2:01 PM

Oil Palm Cultivation: భారత దేశంలో వంట నూనె వినియోగం ఎక్కువ..ఈ నేపథ్యంలో వంట నూనె కోసం విదేశాల నుంచి పామాయిల్ గింజలను దిగుమతి చేసుకుంటున్నాం.. ఈ నేపథ్యంలో రైతులను వంట నూనెకు ఉపయోగపడే పంటలను పండించే దిశగా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహకాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కర్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలను అందించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఆయిల్ పామ్ సాగు కోసం అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్ తో పాటు పంచాయితీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది.

2022-23 ఏడాదికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు సబ్సిడీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. పామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు ఎకరానికి మొదటి ఏడాది.. రూ.26,000, రెండవ ఏడాది ఎకరానికి రూ.5,000, మూడవ ఏడాది ఎకరానికి రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది.

పామ్ పంట పండించే విధానంపై అధ్యయనం బృందాన్ని , కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా దేశాలకు పంపించాలని నిర్ణయించింది. ఈ బృందం లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉండనున్నారు.

Also Read: నాడు అన్నం కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసిన.. నేటి దక్షిణాది విలక్షణ నటుడు