Paytm IPO: దేశీయ స్టాక్ మార్కెట్లో IPOల జోరు.. సెబీకి దరఖాస్తు చేసుకున్న Paytm

Paytm: దేశీ బుల్ మార్కెట్‌లో ఐపీఓల జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో అడుగులు వేయగా.. ఇప్పుడు ప్రముఖ మొబైల్ ఫిన్​టెక్ కంపెనీ Paytm ఐపీఓకు సన్నాహాలు చేసుకుంటోంది.

Paytm IPO: దేశీయ స్టాక్ మార్కెట్లో IPOల జోరు.. సెబీకి దరఖాస్తు చేసుకున్న Paytm
Paytm jobs
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 16, 2021 | 2:04 PM

దేశీ బుల్ మార్కెట్‌లో ఐపీఓల జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో అడుగులు వేయగా.. ఇప్పుడు ప్రముఖ మొబైల్ ఫిన్​టెక్ కంపెనీ Paytm ఐపీఓకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందుకు సంబంధించి Paytm మాతృ సంస్థ వన్​97 కమ్యూనికేషన్స్​.. సెబీకి దరఖాస్తు చేసుకుంది. సెబీ ఇందుకు అనుమతిస్తే.. దేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది. ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలను పేటీఎం మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’ మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి అందజేసింది.

వీటిని సమీక్షించి సెబీ ఆమోదం తెలిపితే.. Paytm ఐపీఓకి మార్గం క్లియర్‌ అయినట్లే. ఈ IPO ద్వారా మొత్తం రూ.16,600 కోట్లు సమీకరించనున్నట్లు సెబీకి Paytm తెలిపింది. వీటిలో తాజా షేర్ల ద్వారా రూ.8,300 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద మరో రూ.8,300 కోట్ల విలువ చేసే షేర్లను వాటాదార్లు ఐపీఓలో విక్రయానికి ఉంచనున్నారు.

అమ్మకానికి ఆఫర్‌లో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, అలీబాబా గ్రూప్ మరియు దాని అనుబంధ సంస్థలైన యాంట్ ఫైనాన్షియల్, ఎలివేషన్ క్యాపిటల్, ఎస్విఎఫ్ పార్ట్‌నర్స్, బిహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ షేర్ల అమ్మకం ఆఫర్ ఉంది.

ఐపిఓ ద్వారా చెల్లింపు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది పనిచేస్తుందని పేటిఎమ్ తన ముసాయిదాలో తెలిపింది. Paytm యొక్క IPO లో, 75 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (QIB లు) కేటాయించబడింది. ఇందులో యాంకర్ పెట్టుబడిదారులకు 60 శాతం వరకు సురక్షితంగా ఉంచవచ్చు. నికర ఆఫర్‌లో 15% సంస్థేతర పెట్టుబడిదారులకు కేటాయించవచ్చు. రిటైల్ పెట్టుబడిదారులకు 10% కేటాయించవచ్చు.

ఇవి కూడా చదవండి: Tirumal Hundi: తిరుమల శ్రీవారి హుండీలో పాకిస్తానీ కరెన్సీ.. ఆశ్చర్యపోయిన అధికారులు..

Newton Predicts: న్యూటన్ ముందే చెప్పాడా.. భూమి అంతం కాబోతోందా.. ప్రళయం ముంచుకొస్తోందా..