Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల కార్బొహైడ్రేట్స్ సంగ్రహణ మందగిస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ ఒకేసారి పెరగడం ఉండదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో కీలకంగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ నియంత్రిస్తుంది. చియా గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి. 

రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
chia seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 17, 2025 | 10:08 PM

చియా విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. నీళ్లలో చియా సీడ్స్ నానబెట్టడం వల్ల జెల్‌లా ఏర్పడుతుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల కార్బొహైడ్రేట్స్ సంగ్రహణ మందగిస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ ఒకేసారి పెరగడం ఉండదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో కీలకంగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ నియంత్రిస్తుంది. చియా గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.

చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలేయదు. అర్ధరాత్రి ఆకలిని నియంత్రిస్తుంది. అతిగా తినడాన్ని ఆపుతుంది. ఫలితంగా బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది. చియా సీడ్స్‌లో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. దాంతో గట్ హెల్త్ మెరుగుపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. చియా సీడ్స్‌లో ఉండే ట్రిప్టోఫాన్ అనే ఎమైనో ఆసిడ్ సెరిటోనిన్, మెలానిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఫలితంగా మంచి నిద్ర పడుతుంది.

చియా విత్తనాలు చిన్నవిగా ఉండవచ్చు, కానీ అవి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం నుండి ఎముకలను బలోపేతం చేయడం, రక్తంలో చక్కెర నిర్వహణ వరకు ప్రతిదానినీ మెరుగుపరుస్తాయి. చియా గింజలు ఖనిజాలకు గొప్ప మూలం. ఇవి ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఉంటాయి. 25 గ్రాముల చియా విత్తనాలలో దాదాపు 158 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది, ఇది ఒక గ్లాసు పాలలో ఉన్నంత.

ఇవి కూడా చదవండి

చియా విత్తనాలలో పాలీ-అన్‌శాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇది కాకుండా, ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చియా గింజలు, చియా పిండి కూడా అధిక రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటును తగ్గిస్తాయి. అయితే, పూర్తి ప్రయోజనాలను పొందాలంటే ఏదైనా ఆహార మార్పు జీవనశైలిలో మార్పులు మరియు వ్యాయామ మార్పులు కూడా అవసరమని గుర్తుంచుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..