AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato: టమాటా ధర తక్కువగా ఉన్నప్పుడే ఈ పొడిని చేసుకోండి.. రసం, కూరల్లోకి సూపర్

శాఖాహార వంటలకైనా, మాంసాహార వంటలకైనా టమాటా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే భారతీయుల వంటలు టమాటా లేనిదే చేసుకోరు అంటే అతిశయోక్తి కాదు. సీజనల్ పంట టమాటా ధరలు ఎప్పుడూ స్తిరంగా ఉండవు. కొన్ని సార్లు కిలో వందకు చేరుకొని కొనుక్కునేవారిని కన్నీరు పెట్టిస్తే.. ఒకొక్కసారి కిలో టమాటా కనీసం రూపాయి కూడా రాక పండించిన రైతులకు నష్టాలకు మిగులుస్తుంది. అయితే టమాటా ధర తక్కువగా ఉన్నప్పుడు టమాటా పచ్చడి పెట్టుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే.. అయితే టమాటా పొడిని చేసుకుని నిల్వ చేసుకుంటే.. అవసరం అయినప్పుడు రసం, కూరల్లోకి ఉపయోగించవచ్చు.

Tomato: టమాటా ధర తక్కువగా ఉన్నప్పుడే ఈ పొడిని చేసుకోండి.. రసం, కూరల్లోకి సూపర్
Make Tomato Powder
Surya Kala
|

Updated on: Mar 18, 2025 | 11:44 AM

Share

టమాట ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్నా మొన్నటి వరకు సామాన్యులను చుక్కలు చూపిన టమాటా ధర.. ఇప్పుడు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఛాయ్ కంటే చీప్‌గా మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే టమాటాలను ఖరీదు చేసి రకరకాల నిల్వ పచ్చళ్ళు చేసుకుంటారు కొందరు. అయితే తక్కువ ధర ఉన్నప్పుడు టమాటా ను కొనుగోలు చేసి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే వంటల్లో ఉపయోగించుకోవచ్చు. టమాటా ధర ఎక్కువగా ఉన్నప్పుడు.. ఇలా నిల్వ చేసుకున్న టమాటా పొడిని ఉపయోగించుకోవచ్చు. టమాటా ధర తక్కువగా ఉన్నప్పుడు నెలల పాటు నిల్వ ఉండే టమాటా పొడిని తయారు చేసుకోండి. ఈ టమాటా పొడితో కూరలు, రసం, పప్పు వంటివి తయారు చేసుకోవచ్చు. ఈ రోజు నెలల పాటు నిల్వ ఉండే టమాటా పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

  1. ముందుగా శుభ్రమైన టమాటాలను ఎంచుకోవాలి. అంటే టమాటాలు మరీ పచ్చిగా ఉండరాదు. అదే విధంగా బాగా పండిన టమాటాలు కూడా పని రావు. కనుక టమాటా పొడిని తయారు చేసుకోవడానికి మెత్త పడని.. దోర టమాటాలను ఎంచుకోవాలి.
  2. టొమాటలను నీటిలో వేసి శుభ్రంగా కడిగి.. తడి లేకుండా తుడవాలి.
  3. ఒక క్లాత్ మీద ఆ టమాటాలను పోసి.. కొంచెం సేపు గాలికి ఆరబెట్టండి.
  4. తర్వాత టమాటాలను సన్నని పొడవైన ముక్కలుగా కట్ చేసుకోవాలి,
  5. ఇవి కూడా చదవండి
  6. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని దానిపై ఒక కాటన్ క్లాత్ వేసి.. దానిపై సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పోయాలి
  7. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను ఎండలో పెట్టాలి. రాత్రి తేమ చేరకుండా ఫ్యాన్ కింద పెట్టుకోవాలి.
  8. ఈ టమాటా ముక్కలు తడి లేకుండా ఎండిపోయే వరకూ ఎండలో పెట్టి ఒరుగులుగా చేసుకోవాలి.
  9. ఒక టమాటా ముక్కని విరిచి చూడండి.. తడి లేకుండా టమాట ముక్కలు ఎండిపొతే.. ఆ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోండి.
  10. ఇలా గ్రైండ్‌ చేసుకున్న టమాటా పొడిని తడి లేని, గాలి చొరబడని గాజు సీసాలో వేసి.. ఈ సీసాని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
  11. ఈ టమాటా పొడి నెలల పాటు నిల్వ ఉంటుంది.

ఎప్పుడైనా టమాటా ధరలు పెరిగితే ఆ సమయంలో టమాటా పొడిని ఉపయోగించి పప్పు, రసం, చారు, కూర ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ధర ఎలా తక్కువగా ఉంది.. కనుక ఈ టమాటా పొడిని రెడీ చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి