AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ.. పిచ్చి పీక్‌స్టేజ్‌లో అంటున్న నెటిజన్లు

అందంగా ఉండడం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే.. ముఖం మాత్రమే కాదు.. కాళ్ళు, చేతులు, గోర్లు ఇలా ప్రతి ఒక్కటీ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గోర్లు డిఫరెంట్ గా అందంగా కనిపించాలని నెయిల్ పాలిష్ తో పాటు ఇప్పుడు అందమైన డిజైన్స్ కూడా వేసుకుంటున్నారు. ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ ట్రెండ్ లో ఉంది. దీని కోసం స్త్రీలు డబ్బులను, సమయాన్ని కూడా ఖర్చు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ నెయిల్ ఆర్ట్ అంటే రకరకల రంగులతో .. అందమైన డిజైన్స్ తో వేసుకునేది. అయితే ఇప్పుడు ఒక నమ్మశక్యం కాని నెయిల్ ఆర్ట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

Viral Video: బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ.. పిచ్చి పీక్‌స్టేజ్‌లో అంటున్న నెటిజన్లు
Nail Art With CockroachImage Credit source: social media
Surya Kala
|

Updated on: Mar 18, 2025 | 10:10 AM

Share

ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ ట్రెండ్‌లో ఉంది. మహిళలు అందమైన గోర్ల కోసం గంటల తరబడి సెలూన్లలో గడుపుతున్నారు నెయిల్ ఆర్ట్ క్లాసిక్ నుంచి అసాధారణమైన డిజైన్ల వరకు ఉంటుంది. ఇది వ్యక్తి అభిరుచికి అనుగుణంగా ఉంటుంది. ఓ వైపు నెయిల్ ఆర్ట్స్ ని ఇష్టపడుతూనే.. కొంతమంది కృత్రిమ గోర్లను కూడా ఎంచుకుంటున్నారు. ఈ కృతిమ గోళ్ళతో పొడవైన గోర్లను.. రకరకాల డిజైన్స్ తో అందంగా కనిపించేలా చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఒక నెయిల్ ఆర్ట్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక యువతి నకిలీ గోరుని డిజైన్ చేయడానికి ఒక బతికి ఉన్న బొద్దింకను ఉపయోగించింది. ఈ కీటకాన్ని గోరుని అలంకరించే అలంకరణగా ఉపయోగించింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ తింటున్నారు.

నెయిల్ ఆర్ట్ కి సంబంధించిన ఒక వీడియోపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. మరికొందరు షాక్ తింటున్నారు. ఈ వీడియోలో ఒక బ్యూటీషియన్ ఇక సింథటిక్ గోరుని డిజైన్ చేస్తోంది. అయితే ఇలా డిజైన చేయడానికి ఆమె బొద్దింకను ఉపయోగించింది. అది కూడా బతికి ఉన్న బొద్దింకను ఉపయోగించింది. నకిలీ గోరులోపల బొద్దింకను పెట్టి.. దానిపై గమ్ ని జోడించింది. పారదర్శక యాక్రిలిక్ లేదా జెల్ ఎక్స్‌టెన్షన్‌ వేయడంతో బొద్దింక ఆ సింథటిక్ గోరు లోపల ఒక డిజైన్ లా చిక్కుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో ఒక యువతి బొద్దింకను గోరుకు అతికించి.. దానిపై ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ పూత పూసింది. అప్పుడు ఆ గోరు నిగనిగలాడుతూ.. మెరుస్తూ అందంగా తయారు అయింది. బొద్దింక గోరుకు సురక్షితంగా అతుక్కుపోయిందని.. అందంగా కనిపిస్తుందని నిర్ధారించుకున్న తర్వాత.. ఆ బ్యూటీషియన్ బొద్దింకతో ఉన్న కృతిమ గోరుని తీసుకుని తన క్లయింట్ వద్దకు వెళ్ళింది. తర్వాత ఆ గోరుని తన కస్టమర్ గోరుకు అతికించింది.

ఈ వీడియో విచిత్రమైన పద్దతిలో డిజైన్‌ను చేసింది.

కృత్రిమ గోరు లోపల జీవించి ఉన్న బొద్దింకని పెట్టడం ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వింతైన గోరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఛీ ఛీ ఇదేమిటి అని కామెంట్ చేస్తే.. మరొకొందరు ఇలాంటి వింతైన కంటెంట్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..