- Telugu News Photo Gallery Not brushing teeth at night may increase the risk of cardiovascular disease
Brushing at Night: బాబోయ్.. రాత్రిళ్లు బ్రష్ చేయకపోతే ఏకంగా గుండె జబ్బులొస్తాయా..?
ఉదయం, సాయంత్రం ఇలా రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం మంచి నోటి పరిశుభ్రతకు ఛూమంత్రం. ఇది దంతక్షయం, దుర్వాసనతో సహా అనేక సమస్యలను నివారిస్తుంది. అయితే చాలా మంది రాత్రిపూట పళ్ళు తోముకోవడానికి బద్దకిస్తుంటారు. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది..
Updated on: Mar 18, 2025 | 12:59 PM

ఆ కుంచె నుంచి ఆ వ్యాధి తరువాత మళ్ళీ వ్యాపిస్తుంది. దంతాల వెలికితీత తర్వాత లేదా నోటి లోపల ఏ రకమైన శస్త్రచికిత్స జరిగినా.. ఆ తర్వాత మీ టూత్ బ్రష్‌ను ఖచ్చితంగా మార్చడం కూడా మర్చిపోవద్దు.

అందుకే నోటి ఆరోగ్యం ఎంత ముఖ్యమో వైద్యులు పదేపదే చెబుతుంటారు. రాత్రిపూట పళ్ళు తోముకోవడంలో నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట పళ్ళు తోముకోవడం అంటే కేవలం కావిటీస్‌ను నివారించడం మాత్రమే కాదు. దానికంటే ఎక్కువ ఆరోగ్య రహస్యం దాగి ఉంది.

నోటి నుండి వచ్చే బాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. ఇది కాలక్రమేణా గుండెను ప్రభావితం చేస్తుంది. నోటి పరిశుభ్రత వల్ల గుండె జబ్బులు నేరుగా పరిశోధనల్లో నిరూపించబడనప్పటికీ, దానికి బలమైన సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు.

2023లో ప్రచురించబడిన ఒక అధ్యయన ప్రకారం.. రాత్రిపూట పళ్ళు తోముకోకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను పలువురు వైద్యులు నొక్కి చెబుతున్నారు. అందులో ముఖ్యంగా రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం వల్ల ముఖంలో చిరునవ్వు,మంచి శ్వాస ఉండటమే కాకుండా, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని పేర్కొంది.

రోజుకు నోటిని రెండుసార్లు శుభ్రం చేసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా రోజుకు కనీసం రెండుసార్లు పళ్ళు తోముకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదని చూపించాయి.




