- Telugu News Photo Gallery Chanakya Neeti: If you do this, no matter how rich you are, you will become poor!
చాణక్య నీతి : ఇలా చేస్తే ఎంతటి ధనవంతులైనా సరే పేదవారు అవ్వాల్సిందేనంట!
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు, వ్యూహ కర్త. ఆయన నేటి సమాజానికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది. నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, అందులో ఎన్నో అద్భుతమైన విషయాలను నేటి తరానికి అందించారు. అవి ఇప్పటి వారికి ఎంతో ప్రేరణగా నిలుస్తున్నాయి.
Updated on: Mar 18, 2025 | 12:32 PM

అయితే కొంత మంది తెలియ చేసే కొన్ని పొరపాట్లే వారి పాలిట శాపంగా మారి, ధనవంతులను కూడా పేదవారిగా చేస్తాయంట. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి అయితే తప్పుడు వ్యక్తులతో సావాసం చేస్తారో ఆ వ్యక్తి జీవితంలో ఎదగలేడంట. అంతే కాకుండా ఆయన ఉన్న ఇంట్లో ధనం ఐస్ ముక్కలా కరిగిపోతూ ఉంటుంది అంటున్నారు చాణక్యుడు.

అదే విధంగా అక్రమంగా సంపాదించిన డబ్బు కొంత సమయం వరకు ఆనందాన్ని ఇచ్చినా, తర్వాత అనేక నష్టాలతో ఆ డబ్బును నష్టపోయే అవకాశం ఉంటుంది. అక్రమమైన డబ్బు ఇంట్లో నిలవదు అంటున్నారు చాణక్యుడు.

చాణక్య నీతి ప్రకారం ఏ ఇంట్లో అయితే స్త్రీని గౌరవించరో, ఆ ఇల్లు పేదరికంలో కూరుకపోతుందంట. ఎంతటి ధనవంతుల ఇల్లైనా, స్త్రీని గౌవరవించకపోతే వారు పేదవారిగా మారడం ఖాయం అంట.

ఎవరింట్లోనైతే ఎప్పుడూ గొడవలు ఉండటం, అలాగే మహిళా ఎప్పుడూ ఇతరులతో గొడవపడుతూ ఉంటుందో, ఆ ఇట్లో ఆర్థిక నష్టం పెరుగుతుందంట. ఇంట్లో అశాంతి నెలకొంటుంది అంటున్నారు చాణక్యుడు.





























