AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు బాగా రాలిపోతుందా..? కేశసౌందర్యం కోసం ఈ లడ్డు తప్పకుండా తినండి

దీనినే బయోటిన్, విటమిన్ B7 లేదా కొన్నిసార్లు విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్, ఇది B-కాంప్లెక్స్ సమూహానికి చెందినది. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల జీవక్రియతో సహా శరీరంలోని వివిధ జీవక్రియ ప్రక్రియలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. అయితే, జుట్టు పెరుగుదల, శరీరంలో బయోటిన్‌ కొరతను తీర్చేందుకు ఈ లడ్డు తప్పకుండా తినండి.

జుట్టు బాగా రాలిపోతుందా..? కేశసౌందర్యం కోసం ఈ లడ్డు తప్పకుండా తినండి
Dry Fruit Laddu
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2025 | 1:11 PM

Share

ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలిపోవటం, నెరిసిన జుట్టు తీవ్రంగా వేధిస్తున్నాయి. అయితే, మనం తీసుకునే ఆహారం, కొన్ని రోజువారి అలవాట్లతో జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. రోజువారీ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం ద్వారా జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది. జుట్టు పెరుగుదలకు అత్యంత అవసరమైన విటమిన్ బయోటిన్‌.

బయోటిన్‌.. దీనినే బయోటిన్, విటమిన్ B7 లేదా కొన్నిసార్లు విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్, ఇది B-కాంప్లెక్స్ సమూహానికి చెందినది. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల జీవక్రియతో సహా శరీరంలోని వివిధ జీవక్రియ ప్రక్రియలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. అయితే, జుట్టు పెరుగుదల, శరీరంలో బయోటిన్‌ కొరతను తీర్చేందుకు ఈ లడ్డు తప్పకుండా తినండి.

బయోటిన్ లోపం వల్ల జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, గోర్లు పెళుసుగా మారడం వంటి సమస్యలు వస్తాయి. కానీ, ఈ లడ్డూలతో శరీరానికి అవసరమైన బయోటిన్ అందుతుంది. దీనికోసం కావాల్సినవి నువ్వులు, వేరుశెనగలు, బాదం, వాల్‌నట్స్, ఖర్జూరాలు, ఓట్స్, అవిసె గింజలు, కొబ్బరి (ఎండు), గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బెల్లం, తేనె, నువ్వులు, వేరుశెనగ పప్పులు, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలను విడివిడిగా దోరగా వేయించుకోండి.

ఇవి కూడా చదవండి

ఖర్జూరం గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వేయించిన నువ్వులు, వేరుశెనగ పప్పులు, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయండి. ఒక పాన్ లో బెల్లం వేసి కరిగించండి. కరిగిన బెల్లంలో ఖర్జూరం ముక్కలు, కొబ్బరి తురుము వేసి బాగా కలపండి. పొడి చేసుకున్న మిశ్రమాన్ని బెల్లం మిశ్రమంలో వేసి బాగా కలపండి. తేనె వేసి బాగా కలపండి. మిశ్రమం కొద్దిగా చల్లారాక చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోండి. రోజుకు రెండు చొప్పున తీసుకుంటూ ఉంటే.. త్వరలోనే శరీరంలో కలిగే మార్పును మీరు గమనిస్తారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి