Fenugreek Seeds: మెంతులతో ఆరోగ్యం రెండింతలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ..
అలాగే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. మెంతుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. తద్వారా రక్తం లెవెల్స్ పెరుగుతాయి. రక్తహీనత తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు ఉన్నవారు మెంతులు తినడం మేలు. మెంతుల్లోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడి వెంట్రుకలు రాలే సమస్యను నివారిస్తాయి.

ప్రతి వంటింట్లోనూ తప్పకుండా ఉండే మసాలా దినుసు మెంతులు.. చూడ్డానికి చిన్నగా ఉన్నా మెంతులతో ఆరోగ్యానికి లెక్కలెనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెంతి ఆకులు, మెంతి గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి కూరలకు రుచి ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని అందిస్తాయి. ముఖ్యంగా మెంతులు నానబెట్టుకుని తీసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ బాధితులు రోజూ మెంతులను తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చునని చెబతున్నారు.
రెండుమూడు వారాల పాటు రోజూ ఇలా నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు మనకు తెలుస్తాయని చెబుతున్నారు. మెంతులు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించేస్తుంది. మెంతులు డయాబెటీస్ అభివృద్ధి చెందకుండా కాపాడతాయి. రెగ్యులర్‌గా మెంతులు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. పాలిచ్చే తల్లులకు కూడా మెంతులు ఎంతో ప్రయోజనకరం. మెంతులు జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యతలకు మెంతులు సరిచేస్తాయి. అంతేకాదు ఇవి నొప్పిని తగ్గించే గుణం కూడా కలిగ ఉంటాయి.
రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో మెంతులు సహాయపడతాయి. వీటిలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించే అమైనో యాసిడ్లు ఉంటాయి. తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మెంతుల్లో గెలాక్టోమన్నన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మెంతుల్లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
మెంతుల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు మెంతులు తీసుకోవడం మంచిది. మెంతులు జీర్ణశక్తిని మెరుగుపర్చి ఆకలిని మెరుగుపరుస్తాయి. అలాగే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. మెంతుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. తద్వారా రక్తం లెవెల్స్ పెరుగుతాయి. రక్తహీనత తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు ఉన్నవారు మెంతులు తినడం మేలు. మెంతుల్లోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడి వెంట్రుకలు రాలే సమస్యను నివారిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..