విటమిన్ B12 లోపం ఉందా ?.. అయితే ఈ వ్యాధులు చుట్టుముట్టినట్లే.. ఎలాంటి ఆహారంతో ఎదుర్కోవాలంటే?
మనం ఆరోగ్యంగా .. ఉత్సాహంగా ఉండటానికి విటమిన్స్ పాత్ర అనేకం. అయితే సీ, డీ, ఈ, బీ12 విటమిన్స్ వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో ఏది లోపించిన... అనేక వ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుంది.
మనం ఆరోగ్యంగా .. ఉత్సాహంగా ఉండటానికి విటమిన్స్ పాత్ర అనేకం. అయితే సీ, డీ, ఈ, బీ12 విటమిన్స్ వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో ఏది లోపించిన… అనేక వ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుంది. అందులో ముక్యంగా బీ12 విటమిన్ లోపం వలన అలసట, మతిమరుపు, కండరాలలో జలదరింపు, తిమ్మిర్లు, నాలుక రుచి కోల్పోవడం, కంటి చూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకలి లేకపోవడం, జీర్ణక్రియ సమస్యలు, చర్మం పాలిపోవడం.. వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే విటమిన్ బీ12 లోపం వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, రక్తహీనత, అట్రోఫిక్ వలన కడుపులో పుండ్లు, క్రోన్స్ వ్యాధి, ఆల్కహాల్ ఎక్కువగా తాగలనిపించడం.. వంటి సమస్యల భారిన పడే అవకాశాలుంటాయి. అందుకే శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని మనకు ఎక్కువగా ఆహారం నుంచే లభిస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ.. చాలా మంది సహజ వనరులను తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంతోపాటు… కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ విటమిన్ బీ12 లోపాన్ని జయించవచ్చు. అవెంటో తెలుసుకుందామా.
సాల్మన్ చేపలు.. ఇందులో బీ విటమిన్, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన బీ12 విటమిన్ లోపాన్ని అధిగమించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తాయి.
గుడ్లు.. గుడ్లు ఆరోగ్యానికి మంచివని అందరికి తెలిసిన విషయమే. రోజూ వీటిని తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు.. వీటిలో విటమిన్ బీ12, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ 12 కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ట్యూనా చేపలు.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ట్యూనా చేపలు విటమిన్ 12 కు మంచి మూలం. ఇది సుమారు 100 గ్రాముల వరకు జీవరాశి 10.9mcg విటమిన్ 12 అందిస్తుంది. ఇది ప్రోటీన్ ఆహారానికి ముఖ్యమైన మూలం.
మాంసం.. మాంసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంటే చికెన్, మటన్ వంటి మాంసాలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఇందులో కాలేయం, కిడ్నీలలో అధికంగా పోషకాలు, విటమిన్లు ఉంటాయి. అయితే మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. అందుకే మాంసాన్ని మితంగా తీసుకోవాలి.
Also Read: Pooja Bhatt: తాగుడుకు బానిసయ్యాను.. అందుకు పోరాటమే చేశా.. హీరోయిన్ పూజాభట్ సంచలన కామెంట్స్..