Moog Dal benefits: పెసర పప్పు ఎక్కువగా తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

సాధారణంగా మన దేశంలో పెసర పప్పు వంటకాలను ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో పెసర పప్పు వంటకాలు అనేకం.

Moog Dal benefits: పెసర పప్పు ఎక్కువగా తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Moong Dal
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2021 | 7:56 PM

సాధారణంగా మన దేశంలో పెసర పప్పు వంటకాలను ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో పెసర పప్పు వంటకాలు అనేకం. సలాడ్, సూప్, చారు ఇలా రకారకాలుగా వంటకాలను చేస్తుంటారు. పెసర పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్స్ బీ9, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బీ4 , ఫాస్పరస్, పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ బీ2, బీ3, బీ5, బీ6 పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ప్రోటిన్స్ అధికంగా ఉన్నాయి. మొలకెత్తిన పెసరపప్పును ఉదయాన్నే తింటే శరీరానికి అధికమొత్తంలో ప్రోటీన్స్, ఆమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

1. ఇందులో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్ మూలకాలు ఉండడం వలన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే క్యాన్సర్, వాపు, గుండె జబ్బులు వంటి సమస్యలను నియంత్రిస్తాయి. 2. ఇందులో ఉండే విటాక్సిన్, ఐసోవిటాక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తాయి. ఎండవేడి నుంచి దెబ్బతిన్న కణాలను ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుందని పరిశోదనలో వెల్లడైంది. 3. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‏ని నియంత్రిస్తుంది. దీంతో గుండె సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఇటీవల వెల్లడైన పరిశోధనలో ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‎ను నియంత్రిస్తుంది. దీంతో గుండె సమస్యలను నియంత్రిస్తుంది. 4. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో ఎక్కువగా ఉపయోగపడతాయి 5. ఇందులో ఉండే పీచు పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కార్బ్ ఇతర పదార్థాల కంటే కూడా ఆరోగ్యకరమైనది. ఇది కడుపుని డిటాక్సిఫై చేయడంలో, శుభ్రపరచడంలో సహాయపడుతుంది. 6. పెసరపప్పులో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆకలి కలిగించే హార్మోన్లు ఎక్కువగా పనిచేయవు. ఫలితంగా చాలా సమయం వరకు పొట్ట నిండినట్లుగా ఉంటుంది. దీంతో బరువు తగ్గడంలో సహయపడుతుంది.

Also Read: Allu Arjun: అనుహ్యంగా భరతుడిని కలిసిన పుష్పరాజ్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్..

SSMB28: మహేష్‏ బర్త్ డే వేళ హీరోయిన్‏ను రివీల్ చేసిన త్రివిక్రమ్.. సూపర్ స్టార్ సరసన ఎవరంటే..

Mahesh Babu Birthday: నెట్టింట్లో మహేష్ బర్త్ డే విషెస్ రచ్చ.. పోలికతో పరువు తీసిన గృహలక్ష్మీ నటి.. ఫ్యాన్స్ ఆగ్రహం..