AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం భోజనంలో ఈ 5 మార్పులు..! ఏంటో తప్పకుండా తెలుసుకోండి..

Health News: కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. మంచి పోషకాలు ఉండే ఆహారం తినడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్కరు

Health News: మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం భోజనంలో ఈ 5 మార్పులు..! ఏంటో తప్పకుండా తెలుసుకోండి..
Diet
uppula Raju
|

Updated on: Aug 31, 2021 | 7:33 PM

Share

Health News: కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. మంచి పోషకాలు ఉండే ఆహారం తినడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్కరు వ్యాయామం, యోగా చేస్తున్నారు. అయితే మీ కుటుంబ సభ్యులు రోగాలకు దూరంగా ఉండాలంటే భోజనంలో ఈ 5 మార్పుల గురించి తెలుసుకోవాలి. వీటిని పాటిస్తే అందరు ఆరోగ్యంగా ఉంటారు. అవేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. నూనెల ఎంపిక కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే నూనెలను తీసుకోవడం తగ్గించండి. ఒమేగా 3 కొవ్వు ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఒమేగా 6, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మన శరీరానికి సమాన పరిమాణంలో అవసరం. రిఫైన్డ్ ఆయిల్స్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వంటకాలలో ఎక్కువగా నెయ్యి, ఆలివ్ నూనె, ఆవ నూనెను వాడటం మంచిది.

2. కార్బోహైడ్రేట్లు తీసుకోవడం తగ్గించండి మనం తినే అన్నం, గోధుమలు, రొట్టె, కూరగాయలు, పండ్లలలో ఎంతోకొంత కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఇవి విభిన్న పరిమాణంలో ఉంటాయి. అయితే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే కొవ్వులు, నూనెలు తీసుకోవడవం తగ్గించాలి. నూడుల్స్, బిస్కెట్లు, పాస్తా వంటి ప్రాసెస్ చేయబడిన ఆహారాలుఉ తీసుకోవడం తగ్గించండి. మీ ఆహారంలో రాగి, కొర్రలు, గోధుమలు వంటి ఆహారాలు ఉండే విధంగా చూసుకోండి. పప్పులు, గింజలను పెంచండి. సమతుల్య ఆహారం కోసం తృణధాన్యాలు తీసుకోవడం చాలా మంచిది.

3. గుడ్లు, చేపలు పాలు, గుడ్డు, జున్ను, పెరుగు, మాంసం, చికెన్ తగినంత తీసుకోవడం అవసరం. ఇవి శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలను అందిస్తాయి. శాఖాహారులు తరచుగా విటమిన్ బి 12 లోపం కలిగి ఉంటారు. పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల దీనిని కవర్‌ చేయవచ్చు.

4. చక్కెరను తగ్గించండి స్వీట్లు, చాక్లెట్‌లు, కూల్‌ డ్రింక్స్ తగ్గించండి. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి అధిక కేలరీలను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి.

5. విత్తనాలు వివిధ రకాల విత్తనాలలో కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి -6 ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఒమేగా 3 పొందడానికి మీరు అవిసె గింజలు, చియా విత్తనాలను డైట్‌లో చేర్చాలి.

Dale Steyn: అతడు బంతి విసిరితే బ్యాట్స్‌మెన్‌కి దడే..! క్రికెట్‌కి గుడ్‌బాయ్‌ చెప్పిన ఫాస్ట్ బౌలర్‌..

రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌ ఈ భారత మాజీ బౌలర్.. వన్డేల్లో సరికొత్త చరిత్రతో షార్జా ‘షహెన్‌షా’ గా ఎదిగాడు.. అతనెవరో తెలుసా?

New Vehicles in September: కొత్త కారు కొందామనుకుంటున్నారా? సెప్టెంబర్ లో సరికొత్తగా రానున్న వాహనాలు ఇవే.. ఓ లుక్కేయండి!