AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kobbari Puvvu: కొబ్బరి పువ్వుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని కనీసం మీరు ఊహించలేరు

సాధారణంగా పల్లెటూర్లలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి. కొందరు ఇళ్లల్లో కూడా కొబ్బరి చెట్లను పెంచుకుంటారు.

Kobbari Puvvu: కొబ్బరి పువ్వుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని కనీసం మీరు ఊహించలేరు
Coconut Flower Health Benef
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2021 | 11:31 AM

Share

సాధారణంగా పల్లెటూర్లలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి. కొందరు ఇళ్లల్లో కూడా కొబ్బరి చెట్లను పెంచుకుంటారు. అయితే కొమ్మ నుంచి కాయ వరకు, వేరు నుంచి పువ్వు వరకు ఇలా కొబ్బరి చెట్టు నుంచి వచ్చేవన్నీ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఒక్కో సారి కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తుంటుంది. ఇలా పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కొందరైతే ఆ పువ్వును తింటారు కూడా. కానీ, కొందరు మాత్రం కొబ్బరి కాయలో వచ్చే పువ్వును తీసి పాడేస్తుంటారు. మరి ఈ కొబ్బరి పువ్వు తినడం వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.. అవేంటో తెలుసుకుందాం.

వాస్తవానికి కొబ్బరి కాయలోని నీళ్ళు ఇంకిపోయి, కొబ్బరి ముదిరినప్పుడు లోపల తెల్లటి పువ్వు ఏర్పడుతుంది. అయితే కొబ్బరినీళ్లు, కొబ్బరి కంటే కూడా ఎక్కువ పోషకాలు కొబ్బరి పువ్వులోనే ఉంటాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి కొబ్బరి పువ్వును ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. కొబ్బరి పువ్వు తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలోనూ, ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడంలోనూ కొబ్బరి పువ్వు సూపర్‌గా సహాయపడుతుంది. కాబట్టి, మధుమేహం వ్యాధితో బాధ పడుతున్న వారు కొబ్బరి పువ్వు దొరికినప్పుడు.. దాన్ని మిస్ చేసుకోకుండా హ్యాపీగా తినొచ్చు. అంతేకాదు కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా.. బరువు తగ్గొచ్చు. కొబ్బరి పువ్వు తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలోనూ కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన వ్యాధిని దరి చేరకుండా చేయడంలోనూ, చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ సూపర్‌గా సహాయపడతాయి. కాబట్టి, కొబ్బరి పువ్వు దొరికినప్పుడు.. తప్పకుండా దానిని డైట్‌లో చేర్చుకోండి.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఎలాంటి అనుమానాలున్నా డైటీషియన్లను, ఆరోగ్య నిపుణులకు సంప్రదించండి)

Also Read: పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై… గ్రామస్తులు ఏం చేశారంటే

చేపల కోసం వల.. అబ్బా ఈరోజు పండుగే అనుకున్నాడు.. అంతలోనే షాక్