Kids Superfood: ఈ సూపర్‌ఫుడ్స్ తింటే.. మీ పిల్లల మెదడు కంప్యూటర్ కంటే వేగంగా దూసుకెళ్తుంది.. అవేంటంటే?

పిల్లల శారీరక, మానసికంగా పెరగాలంటే వారికి సమతుల్య ఆహారం ఇవ్వాలి. పిల్లల ఆహారంలో పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, పప్పులు, గుడ్లు వంటి సూపర్ ఫుడ్స్ చేర్చితే ఎంతో మంచిది.

Kids Superfood: ఈ సూపర్‌ఫుడ్స్ తింటే.. మీ పిల్లల మెదడు కంప్యూటర్ కంటే వేగంగా దూసుకెళ్తుంది.. అవేంటంటే?
Kids Superfood
Follow us
Venkata Chari

|

Updated on: Oct 18, 2021 | 9:43 AM

Food For Children: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల కొరకు, వారికి బాల్యం నుంచి మంచి ఆహారం ఇవ్వాలి. పిల్లల సరైన పెరుగుదల కోసం కొన్ని సూపర్ ఫుడ్ తప్పనిసరిగా ఆహారంలో చేర్చాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని మీరు పిల్లలకు ఇవ్వాలి. ఈ సూపర్‌ఫుడ్‌లతో పిల్లల ఎత్తు, బలంతోపాటు మెదడు ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ రకమైన ఆహారాన్ని తినడం ద్వారా, పిల్లల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. దీని వలన పిల్లలు ఎల్లప్పడూ ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. మీ పిల్లలకు ఎంతో ఉపయోగకరమైన సూపర్‌ఫుడ్‌లు ఏంటో తెలుసుకుందాం.

మీ పిల్లల మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేయాలంటే ఆహారంలో ఈ సూపర్‌ఫుడ్‌ను తప్పక చేర్చాల్సిందే..

1. గుడ్లు: గుడ్లు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లల శారీరక, మానసిక పెరుగుదల కోసం, వారికి ప్రతిరోజూ ఒక గుడ్డు తప్పనిసరిగా తినిపించాలి. గుడ్లలో ప్రోటీన్, విటమిన్-బి, విటమిన్-డి, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. దానివల్ల పిల్లల మనస్సు చురుకుగా మారుతుంది.

2. పాలు: పిల్లల పెరుగుదలకు పాలు చాలా ముఖ్యం. సరైన మోతాదులో పాలు తాగే పిల్లలకు వారి శరీరంలో కాల్షియం, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. పాలలో భాస్వరం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలు, గోర్లు, దంతాలను ఆరోగ్యంగా చేస్తాయి. విటమిన్ డీ లోపం కూడా పాలతో తీరిపోతుంది. పాలు పిల్లలకు పూర్తి ఆహారంగా ఇవ్వడంలో తప్పేంలేదు.

3. అరటి: పిల్లలందరూ అరటిపండు తినడానికి ఇష్టపడతారు. అరటి ఒక పోషకమైన పండుగా గుర్తించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో విటమిన్ బీ6, విటమిన్ సీ, విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, బయోటిన్, ఫైబర్ ఉన్నాయి. అరటిలో మంచి మొత్తంలో గ్లూకోజ్ ఉంటుంది. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. అరటిపండు తినడం ద్వారా కడుపు, జీర్ణక్రియ రెండూ మంచిగా ఉంటాయి.

4. డ్రై ఫ్రూట్స్: పిల్లలకు రోజూ బాదం, జీడిపప్పు, అత్తి పండ్లు, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి . ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. నట్స్ తినడం వల్ల పిల్లలకు శక్తిని ఇస్తుంది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి సహాయపడుతుంది. పిల్లల ఆహారంలో రోజువారీగా డ్రై ఫ్రూట్స్‌ చేర్చితే వారి మెదడు ఎంతో వేగంగా పనిచేస్తుంది.

5. నెయ్యి: పిల్లల మెదడు అభివృద్ధికి నెయ్యి చాలా ముఖ్యం. నెయ్యిలో డీహెచ్‌ఏ కొవ్వు, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా కళ్లు, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ బలపడతాయి. నెయ్యి తినడం ద్వారా పిల్లల ఎముకలు కూడా దృఢంగా మారతాయి.

6. పెరుగు: పిల్లలకు ఆహారంలో పెరుగు ఇవ్వడం ఎంతో మంచింది. పెరుగు తినడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి బలపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. పెరుగులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కనిపిస్తాయి. దీని వలన పలు వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పెరుగులో ప్రోటీన్, లాక్టోస్, ఐరన్, భాస్వరం ఉంటాయి.

7. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు: పిల్లలకు చిన్నప్పటి నుంచే పండ్లు, కూరగాయలను తినడం అలవాటు చేయాలి. ఆకుపచ్చ కూరగాయలు తినడం ద్వారా పిల్లలకు అన్ని విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. దీని కారణంగా శరీరం గొప్ప యాంటీఆక్సిడెంట్లను పొందుతుంది. శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

8. ఓట్స్, గంజి: పిల్లలకు ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, గంజిని తప్పనిసరిగా తినిపించాలి. ఓట్స్‌లో కరిగే ఫైబర్, బీటా-గ్లూకాన్ ఉంటుంది. ఇది గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది. ఓట్స్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, పిల్లలకు శక్తి లభిస్తుంది. గంజి తినడం ద్వారా పిల్లల కడుపు క్లీన్‌గా ఉంటుంది. అలాగే బరువు కూడా పెరుగుతారు.

9. దుంపలు: చిలగడదుంపలు, బంగాళాదుంపలు తప్పనిసరిగా పిల్లలకు తినిపించాలి. ఇందులో ఫైబర్, కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలు తినడం ద్వారా పిల్లలు పుష్కలంగా శక్తిని పొందుతారు. బంగాళాదుంపలు లేదా చిలగడదుంపలను వేయించడం లేదా ఉడకబెట్టడం ద్వారా పిలలకు తినిపించవచ్చు.

10. బెర్రీలు: పిల్లలు బెర్రీలను ఎంతో ఇష్టపడతారు. పిల్లల ఆహారంలో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు ఉండేలా చూసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉంటాయి. బెర్రీలలో పొటాషియం, విటమిన్ సీ, ఫైబర్, కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి. బెర్రీలలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇవి మనస్సు, శరీరాన్ని బలంగా చేయడంలో సహాపడుతుంది.

Also Read: Karonda Benefits: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? అయితే కరోండా తినాల్సిందే.. ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు మరి..!

Health Benefits: నాన్‌వెజ్ తింటున్నారా? అయితే, ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Health Benefits: బొప్పాయితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?.. షాకింగ్ విశేషాలు మీకోసం..