Andhra Pradesh: పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై… గ్రామస్తులు ఏం చేశారంటే

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఓ ఎస్సై వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బిక్కవోలు ఎస్సై సామర్లకోటలో అత్యుత్సహాం ప్రదర్శంచారు.

Andhra Pradesh: పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై... గ్రామస్తులు ఏం చేశారంటే
Bikkavolu Si
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 18, 2021 | 8:11 AM

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఓ ఎస్సై వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బిక్కవోలు ఎస్సై సామర్లకోటలో అత్యుత్సహాం ప్రదర్శంచారు. పండక్కి సెలవుపై అత్తగారింటికి వెళ్లిన ఎస్సై  సామర్లకోట పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలకు చలానా వేశారు. సెలవుపై సామర్లకోట మండలం పండ్రావాడ గ్రామానికి వచ్చిన ఎస్సై.. ఫైన్ వేయడం దారుణం అని వాహనదారులు వాపోతున్నారు. అయితే ఆ చలానాలు కూడా భారీగా ఉన్నాయి. ఒక బైక్‌కు 5,035 రూపాయలు వేయగా.. మరో బైక్‌కు పదివేల 70 రూపాయల చలానా వేశారు. ఆన్ లైన్ ద్వారా రెండు వాహనాలకు ఫైన్ వేశారు ఎస్సై. అయితే గతంలో బాకీ ఉన్న చలానాలతో కలిపి అంత మొత్తం అయిందా.. లేదా ఒకేసారి భారీ ఫైన్ వేశారా అన్నది తెలియాల్సి ఉంది. తన పరిధి కాకపోయినా అత్తగారి ఇంటికి వచ్చి ఫైన్ లు విధించిన ఎస్సై శ్రీనివాస్‌ను వాహనదారులు నిలదీశారు. ఎస్ఐ తీరుపై గ్రామస్తులు, వాహనదారులు అతని ఇంటికి వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్దకు వచ్చినవారిపై ఎస్సై సీరియస్ అయ్యారు. దౌర్జన్యం కింద కేసులు బుక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అందుకు గ్రామస్తులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఘటనపై జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.

Also Read: మహానటిని మించిపోయింది.. భర్త కనిపించడం లేదని ఫిర్యాదు.. అసలు నిజం తెలిస్తే షాకే

మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం… క్షణాల్లో మాంసపు ముద్దలుగా తల్లీ, కొడుకు