Kurnool: మహానటిని మించిపోయింది.. భర్త కనిపించడం లేదని ఫిర్యాదు.. అసలు నిజం తెలిస్తే షాకే

అడ్డొస్తే..అడ్డంగా చంపేయడమేనా! రీల్‌ డైలాగ్‌ను మించిన రియల్‌ రక్త చరిత్ర హడలెత్తిస్తోంది. వివాహేతర సంబంధాల మోజులో మానవత్వాన్ని మంటగల్పేస్తున్నారు.

Kurnool: మహానటిని మించిపోయింది.. భర్త కనిపించడం లేదని ఫిర్యాదు.. అసలు నిజం తెలిస్తే షాకే
Women Kills Husband
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 18, 2021 | 6:38 AM

అడ్డొస్తే..అడ్డంగా చంపేయడమేనా! రీల్‌ డైలాగ్‌ను మించిన రియల్‌ రక్త చరిత్ర హడలెత్తిస్తోంది. వివాహేతర సంబంధాల మోజులో మానవత్వాన్ని మంటగల్పేస్తున్నారు కొందరు. పతీ పత్ని ఔర్‌ క్రైమ్‌ కతా చిత్రమ్‌ కర్నూల్‌ జిల్లాలో సంచలనం రేపింది.  కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ .. రామయ్య అనే వ్యక్తి అదృశ్యం కలకలం రేపింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసుగా దర్యాప్తు చేపట్టారు. చెట్టు పుట్ట వాగుల్ని గాలించారు. మిస్టరీ వీడింది. పండ్ల వ్యాపారి రామయ్య కన్పించడంలేదని ఆయన భార్య జయలక్ష్మి పోలీసుల్ని ఆశ్రయించింది. ఎంక్వయిరీ చేస్తే రామయ్యకు ఎవరితో అంతగా విభేదాల్లేవని తేలింది. తన భర్తకు ఏమైందో.. ఎక్కడున్నాడో అని తెగ ఇదైపోతున్న జయలక్ష్మి వైఖరిపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు.అదే టైమ్‌లో సాలిడ్‌ ఇన్పర్మేషన్‌ వచ్చింది. కట్ చేస్తే జయలక్ష్మి, కైజర్‌ల బంధం వెలుగులోకి వచ్చింది.

తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని ఈ ఇద్దరు పక్కా పథకంతో రామయ్యను హత్య చేశారని తేలింది. డెడ్‌బాడీని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి హంద్రీ నీవా కాలువలో పడేశారు. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే.. జయలక్ష్మి కూతురు, కొడుకు తల్లి నిర్వాకాన్ని కళ్లారా చూశారు. ఇరుగుపొరుగుకు చెప్పారు. అలా సమాచారం పోలీసులకు చేరింది. గాలింపు చేపడితే హంద్రీనీవాలో రామయ్య డెడ్‌ బాడీ ట్రేస్‌ ఔటయింది.  పక్కా ఆధారాలతో నిందితులు జయలక్ష్మి, కైజర్‌ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు ఓర్వకల్లు పోలీసులు. నిజం తెలిసి ఊరు ఊరంతా నివ్వెరపోయారు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు స్థానికులు.

Also Read: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షణాల్లో మాంసపు ముద్దలుగా తల్లీ, కొడుకు

దసరా, ఉప ఎన్నిక ఎఫెక్ట్.. 2 రోజుల్లో మద్యం అమ్మకాలు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్