Spicy Ginger Chicken Recipe: రెస్టారంట్ స్టైల్‌లో ఇంట్లోనే టేస్టీ టేస్టీ జింజర్ చికెన్ తయారీ విధానం

ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ తో ఆహారపదార్ధాలను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు స్పైసీ జింజర్ చికెన్ తయారీ గురించి తెలుసుకుందాం..

Spicy Ginger Chicken Recipe: రెస్టారంట్ స్టైల్‌లో ఇంట్లోనే టేస్టీ టేస్టీ జింజర్ చికెన్ తయారీ విధానం
Ginger Chicken
Follow us

|

Updated on: May 29, 2022 | 9:33 AM

Spicy Ginger Chicken: చికెన్, మటన్ లతో పాటు సీఫుడ్ అయిన రొయ్యలు, చేపలు, పీతలు వంటి ఆహారపదార్ధాలను నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. అయితే వీటన్నిటిలో ఎక్కువమంది ఇష్టంగా తినేది. చికెన్. ఈ చికెన్ ను కూర, ఫ్రై, బిర్యానీ వంటిని తయారు చేసుకుని తినరు. అయితే ఇలా చికెన్ తో రెగ్యులర్ గా ఆహారం తయారు చేస్తే.. ఎప్పుడూ ఇదేనా అంటూ.. పిల్లల సహా పెద్దలు కూడా నిరాశను వ్యక్తం చేస్తారు. రెస్టారెంట్ కు వెళ్దాం అని అంటారు. అయితే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ తో ఆహారపదార్ధాలను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు స్పైసీ జింజర్ చికెన్ తయారీ గురించి తెలుసుకుందాం..

తయారీకోసం కావాల్సిన పదార్ధాలు:

మ్యారినేట్ కోసం: చికెన్ – 1 కిలో అల్లం పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ నూనె – 2 టేబుల్ స్పూన్లు

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ 2 టొమాటోల ప్యూరీ పసుపు – 1/2 టీస్పూన్ ధనియాల పొడి – 2 టీస్పూన్లు కరివేపాకులు

డెకరేషన్ కు: ఉల్లిపాయలు(వేయించినవి) నిలువగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లంపొడవుగా తరిగిన వేయించిన జీడిపప్పులు తరిగిన కొత్తిమీర

తయారీ విధానం: ముందుగా చికెన్ ను మ్యారినేట్ చేయాలి. అందుకు మిక్సీ గిన్నె తీసుకుని తరిగిన అల్లం వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. అనంతరం దానిని పక్కకి తీసుకుని ఒక పది పచ్చిమిర్చిని వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టాలి. అనంతరం ఉల్లిపాయలు 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పేస్ట్ చేసుకుని దీనిని కూడా పక్కకు పెట్టుకోవాలి. అనంతరం ఒక కిలో బోన్ ఉన్న చికెన్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని అందులో మెత్తటి అల్లంపేస్ట్ , పచ్చి మిర్చి పేస్ట్, ఉల్లి వెల్లుల్లి పేస్ట్ తో పాటు టీ స్పున్ ఉప్పు వేసుకుని చికెన్ ముక్కలు బాగా పట్టేలా చేసుకుని ఈ చికెన్ మిశ్రమాన్ని పక్కకు పెట్టాలి. అలా ఒక గంట పాటు ఈ చికెన్ ను నానబెట్టుకోవాలి. అనంతరం .. ఒక కడాయి తీసుకుని నూనె వేసుకుని ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ను తీసుకుని అందులో వేసుకుని ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి. తర్వాత ఈ చికెన్ ను పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ నూనె వేసుకుని అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కమ్మటి స్మెల్ వచ్చే వరకూ వేయించుకుని అనంతరం అందులో టమాటా ప్యూరీ ని వేసుకోవాలి. ఒక 3 నిముషాలు వేయించి.. అనంతరం పసుపు, రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకుని బాగా కలపాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అనంతరం.. ఇంతకు రెడీ చేసుకున్న చికెన్ వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. అనంతరం టెస్టుకు తగిన ఉప్పు వేసుకోవాలి. తర్వాత.. స్విమ్ లో పెట్టుకుని చికెన్ ను కదుపుతూ ఉండాలి. లాస్ట్ కు చికెన్ దగ్గరకు ఉడుకుతుంది. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిలువగా తగిన పచ్చిమిర్చి, వేయించిన జీడిపప్పు , తగిన కొత్తిమీర , పొడవుగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుని.. బాగా కలిపాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో టేస్టీ టేస్టీ స్పైసీ జింజర్ చికెన్ తయారీ. ఇలా వేడి వేడిగా తినవచ్చు. లేదా అన్నంలో సాంబార్, రసంలో కి బాగుంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.