Crispy Alu Fry: రెస్టారెంట్ స్టైల్‌లో రుచిగా, క్రిస్పీగా ఆలూ ఫ్రై చేసుకోండి ఇలా.. స్నాక్ ఐటెంగా కూడా తినొచ్చు..

పిల్లలకు అత్యంత ఇష్టమైన వంటల్లో ఒకటి బంగాళాదుంపల ఫ్రై. అయితే కొంతమంది తాము ఇంట్లో చేసే ఫ్రై హోటల్ లో చేసినట్లు రుచిగా, క్రిస్పీగా ఉండదు అంటూ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మీరు కూడా అదే రుచితో ఇంట్లోనే క్రిస్పీగా ఆలూ ఫ్రై ని తయారుచేసుకోవచ్చు.

Crispy Alu Fry: రెస్టారెంట్ స్టైల్‌లో రుచిగా,  క్రిస్పీగా ఆలూ ఫ్రై చేసుకోండి ఇలా.. స్నాక్ ఐటెంగా కూడా తినొచ్చు..
Crispy Aloo Fry Recipe
Follow us

|

Updated on: May 26, 2022 | 10:48 AM

Crispy Alu Fry: పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే కూరగాయల్లో బంగాళాదుంపలది మొదటి స్థానం అని చెప్పవచ్చు. అందుకనే ఈ బంగాళాదుంపలతో అనేక రకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. బంగాళాదుంపలతో చేసిన ఏ వంటకమైనా ఎంతో రుచిగా ఉంటుంది.  బంగాళా దుంపలతో బిర్యానీ, కూర, వేపుడు, స్వీట్, చిప్స్ వంటి అనేక రకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. పిల్లలకు అత్యంత ఇష్టమైన వంటల్లో ఒకటి బంగాళాదుంపల ఫ్రై. అయితే కొంతమంది తాము ఇంట్లో చేసే ఫ్రై హోటల్ లో చేసినట్లు రుచిగా, క్రిస్పీగా ఉండదు అంటూ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మీరు కూడా అదే రుచితో ఇంట్లోనే  క్రిస్పీగా ఆలూ  ఫ్రై ని తయారుచేసుకోవచ్చు. ఈరోజు ఎలా  బంగాళాదుంప ఫ్రై ని చేసుకోవచ్చో తెలుసుకుందాం..

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

బంగాళా దుంప‌లు పచ్చిమిర్చి (నిలువుగా కట్ చేసుకోవాలి) అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు శనగపిండి కార్న్ ప్లోర్ బియ్యం పిండి గరం మసాలా ఉప్పు రుచికి సరిపడా కారం టెస్టింగ్ సాల్ట్ ఫుడ్ క‌ల‌ర్ నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా

ఇవి కూడా చదవండి

త‌యారీ విధానం: బంగాళదుంపలను పొట్టు తీసుకుని శుభ్రం చేసుకుని మధ్యస్థంగా ఉండేలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను ఉప్పు నీటిలో వేసుకుని శుభ్రం చేసి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత శనగపిండి, బియ్యంపిండి. ఫుడ్ కలర్, అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, కార్న్ ప్లోర్ , టెస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం స్టౌ మీద కడాయి పెట్టి.. నూనె వేసి.. కాగిన అనంతరం స్టఫ్ చేసుకున్న బంగాళా దుంప ముక్క‌ల‌ను వేసుకుని 2 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించుకుని.. తర్వాత స్విమ్ లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేవరకూ బంగాళాదుంప ముక్కలను వేయించుకోవాలి. తర్వాత వాటిని టిష్యూ వేసిన ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో నిలువా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకుని ఆ ఆలూ ఫ్రై ముక్కలకు కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే హోటల్ స్టైల్ లో ఆలూ ఫ్రై రెడీ.

వీటిని ఇలా స్నాక్స్ గా టమాటా కెచప్ తో తినవచ్చు. లేదా అన్నంలోకి సాంబార్ తో పాటు కలుపుకుని తినవచ్చు.

బంగాళా దుంప‌లను మితంగా ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విట‌మిన్ సి, విట‌మిన్ బి6 ల‌తోపాటు కాప‌ర్, మాంగ‌నీస్ వంటి మిన‌ర‌ల్స్ వంటివి ఉన్నాయి. ఇక మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, కాలేయం ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో, మూత్ర పిండాల‌లో రాళ్లు ఏర్ప‌కుండా బంగాళా దుంపలు చేస్తాయి.

మరిన్ని ఆహారం రెసిపీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి