AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Corn Manchurian: స్పైసీ స్పైసీగా బేబీ కార్న్ మంచూరియా.. రెస్టారెంట్ స్టైల్ స్నాక్ ఇంట్లోనే!

నోరూరించే బేబీ కార్న్ మంచూరియా ఇంట్లో తయారుచేసుకోవడం చాలా ఈజీ. రెస్టారెంట్‌ స్టైల్‌లో ఉండే ఈ డిష్‌ను స్నాక్‌గా లేదా స్టార్టర్‌గా ఆస్వాదించవచ్చు. క్రిస్పీగా వేయించిన బేబీ కార్న్‌ను కారం, పులుపు, తియ్యదనం కలగలిసిన సాస్‌తో కలిపితే అదిరిపోయే రుచి వస్తుంది. ఈ రుచికరమైన బేబీ కార్న్ మంచూరియాను ఎలా తయారుచేయాలో ఇందులో వివరంగా తెలుసుకుందాం.

Baby Corn Manchurian: స్పైసీ స్పైసీగా బేబీ కార్న్ మంచూరియా.. రెస్టారెంట్ స్టైల్ స్నాక్ ఇంట్లోనే!
Baby Corn Manchurian Recipe
Bhavani
|

Updated on: Jun 18, 2025 | 11:34 AM

Share

బేబీ కార్న్ మంచూరియా అనేది చాలా రుచికరమైన ఇండో-చైనీస్ స్టార్టర్. వర్షాకాలం వచ్చిందంటే వేడి వేడిగా ఇంట్లో చేసుకోగల స్నాక్స్ కోసం వెతుకుతుంటాం. మంచి వెదర్ లో నోట్లోని టేస్ట్ బర్డ్స్ ని సాటిస్ఫై చేసేలా ఏదైనా తినాలకునే వారు కూడా మరో ఆలోచన లేకుండా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. బేబీ కార్న్ మంచూరియాను ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. అయితే దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం కష్టం అని అనుకుంటారు. ఈ సింపుల్ టిప్స్ తో దీన్ని రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:

బేబీ కార్న్ – 250 గ్రాములు

మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు

కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు (కార్న్ ఫ్లోర్ స్లర్రీ కోసం అదనంగా 1 టేబుల్ స్పూన్)

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్

కారం – 1/2 టీస్పూన్ (మీ కారానికి తగినట్లుగా)

మిరియాల పొడి – 1/2 టీస్పూన్

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

సాస్ కోసం:

నూనె – 1 టేబుల్ స్పూన్

సన్నగా తరిగిన వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్

సన్నగా తరిగిన అల్లం – 1 టీస్పూన్

పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి లేదా నిలువుగా చీల్చినవి)

ఉల్లిపాయ – 1 చిన్నది (ముక్కలుగా కట్ చేసినవి లేదా సన్నగా పొడవుగా కట్ చేసినవి)

క్యాప్సికమ్ – 1/2 (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)

సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్

రెడ్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్

టమాటో కెచప్ – 2-3 టేబుల్ స్పూన్లు

వెనిగర్ – 1/2 టీస్పూన్ (ఆప్షనల్)

మిరియాల పొడి – 1/4 టీస్పూన్

ఉల్లికాడలు (స్ప్రింగ్ ఆనియన్స్) – 2 టేబుల్ స్పూన్లు (తరుగు)

కార్న్ ఫ్లోర్ స్లర్రీ – 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌కు 1/4 కప్పు నీరు కలిపిన మిశ్రమం (గ్రేవీ కోసం)

తయారీ విధానం:

ముందుగా బేబీ కార్న్‌లను శుభ్రంగా కడిగి, మీకు నచ్చిన పరిమాణంలో (చిన్న ముక్కలుగా లేదా రౌండ్ స్లైస్‌లుగా) కట్ చేసుకోండి.

ఒక గిన్నెలో కట్ చేసుకున్న బేబీ కార్న్ ముక్కలు తీసుకోండి. అందులో మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయండి.

ఈ మిశ్రమాన్ని బేబీ కార్న్‌కు బాగా పట్టేలా టాస్ చేస్తూ కలుపుకోండి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు చిలకరించి, పిండి ముక్కలకు పట్టుకునేలా చూసుకోండి (గట్టి బ్యాటర్ లాగా).

ఇప్పుడు ఒక బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి వేడి చేయండి.

నూనె వేడెక్కిన తర్వాత, బేబీ కార్న్ ముక్కలను వేడి నూనెలో వేసి బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యే వరకు మీడియం మంటపై వేయించుకోండి. వేగిన బేబీ కార్న్ ముక్కలను టిష్యూ పేపర్‌పైకి తీసి పక్కన పెట్టుకోండి.

మంచూరియా సాస్ తయారీ:

మరొక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత, సన్నగా తరిగిన వెల్లుల్లి  అల్లం వేసి సువాసన వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేయించుకోండి. అవి మరీ మెత్తబడకుండా కాస్త క్రిస్పీగా ఉండాలి. తరువాత, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్, మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు (సాస్‌లలో ఉప్పు ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వేయాలి) వేసి బాగా కలపండి.

అవసరమైతే, గ్రేవీ చిక్కగా అవడానికి కార్న్ ఫ్లోర్ స్లర్రీ (1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌కు 1/4 కప్పు నీరు కలిపి) వేసి ఒక నిమిషం పాటు ఉడికించండి. సాస్ కొద్దిగా చిక్కబడుతుంది. చివరగా, ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలను సాస్‌లో వేసి, సాస్ ముక్కలకు బాగా పట్టేలా టాస్ చేయండి. ఒక నిమిషం పాటు వేయించి, ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేయండి.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..