Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీ..ఉలవలు తింటారా అనుకోవద్దు.. రేసు గుర్రంలా ఉరికే ఆరోగ్యం కోసం..

జ్వరం, ఆయాసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కషాయం తాగడం ఎంతో మేలు. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు.. తరచూ ఎక్కిళ్లు వచ్చేవారికి ఉలవలు మంచి మందులా పనిచేస్తుంది. తరచూ ఉలవలు తీసుకోవడం వల్ల ఎక్కిళ్ల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు.

చీ..ఉలవలు తింటారా అనుకోవద్దు.. రేసు గుర్రంలా ఉరికే ఆరోగ్యం కోసం..
Horse Gram
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2025 | 10:06 PM

Share

ఉలవలు..మంచి బలవర్ధకమైన ఆహారం. మన శరీరానికి శక్తిని అందించడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ఫైబర్ పుష్కలగా ఉంటుంది. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పీచుపదార్థం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఊబకాయం సమస్య ఉన్నవారు ఉలవలను తినటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో దోహదపడుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంచుతుంది.

మూత్ర సంబంధిత సమస్యలు నివారించడంలో ఉలవలు సహాయపడతాయి. దీనికోసం ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ చిట్కా పాటించండి. జ్వరం, ఆయాసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కషాయం తాగడం ఎంతో మేలు. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు.. తరచూ ఎక్కిళ్లు వచ్చేవారికి ఉలవలు మంచి మందులా పనిచేస్తుంది. తరచూ ఉలవలు తీసుకోవడం వల్ల ఎక్కిళ్ల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు.

కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కల్పించడంలో ఉలవలు దోహదపడతాయి. వీటిలోని పోషకాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తాయి. అంతేకాదు హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉలవలు రక్షిస్తాయి. పిల్లల ఎదుగుదలకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. వారికి బలాన్ని ఇస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. చర్మ సమస్యల నివారణలో, కీళ్ళ నొప్పుల నివారణలో బాగా పని చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్
స్త్రీలకు బెస్ట్ ఆసనాలు ఇవే గర్భాశయ బలంతో సహా ఎన్ని ప్రయోజనాలంటే
స్త్రీలకు బెస్ట్ ఆసనాలు ఇవే గర్భాశయ బలంతో సహా ఎన్ని ప్రయోజనాలంటే
ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ICF ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు!
ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ICF ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు!
లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్..
లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్..
ఇవి ట్యాబ్లెట్స్ కాదు.. ప్రాణాలు తీసే కిల్లర్స్.. ఎంత డేంజరో
ఇవి ట్యాబ్లెట్స్ కాదు.. ప్రాణాలు తీసే కిల్లర్స్.. ఎంత డేంజరో
మూడేళ్ళ రవితేజ చుట్టూ తిరిగా..! ఆయన చంపేస్తా అన్నారు..
మూడేళ్ళ రవితేజ చుట్టూ తిరిగా..! ఆయన చంపేస్తా అన్నారు..
తప్పు చేసినా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడని రాశులు ఇవే..
తప్పు చేసినా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడని రాశులు ఇవే..
అతను అవుట్‌ కాగానే గెలుపు మాదే అనిపించింది!
అతను అవుట్‌ కాగానే గెలుపు మాదే అనిపించింది!
సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే
సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే