దారుణం.. భార్యపై అనుమానంతో చిత్రహింసలు.. పోలీసు ఫిర్యాదులో చెప్పలేని..
రెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా గదిలో బంధించాడని ఆమె ఆరోపించింది. తాను తీవ్రమైన నొప్పి, బాధతో కేకలు వేస్తున్నప్పటికీ చుట్టుపక్కల వారు భయంతో తనకు సహాయం చేయలేదని ఆ మహిళ తెలిపింది. జూన్ 15న తన సోదరుడు తన ఇంటికి వచ్చి తనను రక్షించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళను మొదట

వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తన భార్యకు దారుణమైన చిత్రహింసలు పెట్టాడు ఓ భర్త. ఆమె ప్రైవేట్ భాగాల్లో కారం పొడిని వేసి, బయటకు కనిపించని చోట ఒంటి నిండా ఇనుప రాడ్డుతో కాల్చి వాతలు పెట్టాడంటూ ఓ బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ నెల 13న చోటు చేసుకుంది. శతృఘ్న రాయ్ (40) తనకు విద్యుత్ షాక్ ఇచ్చేందుకు ప్రయత్నించాడని, రెండు రోజులు తిండి, నీరు లేకుండా గదిలో బంధించి, చిత్ర హింసలు పెట్టినట్లు ఆమె ఆరోపించింది. ఈ నెల 15న తన ఇంటికొచ్చిన సోదరుడు రక్షించాడని ఆమె పేర్కొంది.
బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, తన భర్త క్రూరత్వం అక్కడితో ఆగలేదు. తన భర్త శత్రుఘ్న రాయ్ తనను విద్యుత్ షాక్ కు గురిచేయడానికి ప్రయత్నించాడని, రెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా గదిలో బంధించాడని ఆమె ఆరోపించింది. తాను తీవ్రమైన నొప్పి, బాధతో కేకలు వేస్తున్నప్పటికీ చుట్టుపక్కల వారు భయంతో తనకు సహాయం చేయలేదని ఆ మహిళ తెలిపింది. జూన్ 15న తన సోదరుడు తన ఇంటికి వచ్చి తనను రక్షించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళను మొదట పరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించారు. ఆమె గాయాల తీవ్రత కారణంగా వైద్యులు ఆమెను శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SKMCH) కు రిఫర్ చేశారు.
అంతేకాదు.. బాధితురాలిని అత్తమామలు కూడా చంపేస్తామని బెదిరించినట్టుగా పోలీసుల ఫిర్యాదులో ఆమె పేర్కొంది. జూన్ 16న ఆ మహిళ తన భర్త, అత్త దుఖ్ని దేవి (45), బావమరిది సుమేష్ రాయ్ (30), వదిన పుష్ప దేవి (26) లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆమె భర్తను వెంటనే అరెస్టు చేయగా, ఇతర కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..