Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్‌‌కు బహిరంగంగా అవమానం.. అడుగడుగునా వ్యతిరేకత..!

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌కు అమెరికాలో చుక్కలు కనిపించాయి. అడుగడుగునా వ్యతిరేక నినాదాలతో జనం హోరెత్తించారు. అదీ స్వంత దేశం పాకిస్తానీయులే కావడం విశేషం. 'పాకిస్తానీయుల హంతకుడు', 'నియంత సిగ్గుపడాలి', ఈ నినాదాలను అమెరికాలో నివసిస్తున్న పాకిస్తానీలు జనరల్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నినాదించారు.

అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్‌‌కు బహిరంగంగా అవమానం.. అడుగడుగునా వ్యతిరేకత..!
Pakistan Army Chief Asim Munir
Balaraju Goud
|

Updated on: Jun 17, 2025 | 9:39 PM

Share

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌కు అమెరికాలో చుక్కలు కనిపించాయి. అడుగడుగునా వ్యతిరేక నినాదాలతో జనం హోరెత్తించారు. అదీ స్వంత దేశం పాకిస్తానీయులే కావడం విశేషం. ‘పాకిస్తానీయుల హంతకుడు’, ‘నియంత సిగ్గుపడాలి’, ఈ నినాదాలను అమెరికాలో నివసిస్తున్న పాకిస్తానీలు జనరల్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నినాదించారు.

ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం ఆదివారం (జూన్ 15) వాషింగ్టన్ డిసికి చేరుకున్న అసిమ్ మునీర్‌కు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అతని స్వంత దేశ ప్రజలు వీధుల్లో అతన్ని నియంత, పిరికివాడు అని బహిరంగంగా పిలుస్తున్నారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో అసిమ్ మునీర్ హోటల్ వెలుపల అమెరికాలో నివసిస్తున్న ప్రజలు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. హోటల్ వెలుపల ఒక కారు ఆగింది. అసిమ్ మునీర్ హోటల్ నుండి బయటకు వచ్చి కారులో కూర్చోవడం ప్రారంభించినప్పుడు, జనం అతన్ని చూసిన వెంటనే కేకలు వేయడం ప్రారంభించారు. నిరసనకారులు హోటల్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ హోటల్ సిబ్బంది వారిని ఆడ్డకున్నారు.

వీడియో చూడండి..

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, జన సమూహం “అసిమ్ మునీర్, నువ్వు పిరికివాడివి”, “నీకు సిగ్గు లేదు, హంతకుడు”, “సిగ్గు సిగ్గు, నియంత”, “ఇస్లామాబాద్ హంతకుడు” అని నినాదాలతో ఆప్రాంతమంతా హోరెత్తించారు. అయితే అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది ఏ ఇతర దేశస్తులు కాదు.. స్వంత దేశం పాకిస్తాన్‌ వాసులే కావడం విశేషం.

మరో వీడియోలో, అసిమ్ మునీర్ హోటల్ దగ్గర మొబైల్ ఎలక్ట్రానిక్ బిల్ బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిపై అసిమ్ మునీర్ కు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్నాయి. వాటిలో – ‘అసిమ్ మునీర్, హంతకుడు’, ‘తుపాకులు మాట్లాడినప్పుడు, ప్రజాస్వామ్యం ముగుస్తుంది’ అని రాసి ఉంది.

వీడియో చూడండి.. 

ఆ వీడియో గురించి, అసిమ్ మునీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వ్యక్తులు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ (పిటిఐ) మద్దతుదారులుగా భావిస్తున్నారు. అసిమ్ మునీర్ అమెరికా పర్యటన ప్రకటించినప్పుడు, పిటిఐ మద్దతుదారులు వాషింగ్టన్ రాయబార కార్యాలయం వెలుపల భారీగా ప్రదర్శనలు నిర్వహించారు.

పాకిస్తాన్ వార్తాపత్రిక ది డాన్ నివేదిక ప్రకారం, అసిమ్ మునీర్ ఐదు రోజుల పర్యటన కోసం ఆదివారం వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన అమెరికాకు వెళ్లినట్లు ది డాన్ పేర్కొంది. అంతకుముందు అసిమ్ మునీర్ పర్యటనకు ముందు, అమెరికా 250వ ఆర్మీ దినోత్సవ వేడుకలకు హాజరు కావడానికి ఆయనకు ఆహ్వానం అందిందని వార్తలు వచ్చాయి. అయితే, ఆసిమ్ మునీర్ పర్యటనకు యుఎస్ ఆర్మీ దినోత్సవంతో ఎటువంటి సంబంధం లేదని ఆమెరికా వర్గాలు పేర్కొన్నాయి. అయితే రెండూ ఒకే తేదీన జరగాల్సి ఉన్నప్పటికీ, యుఎస్ ఆర్మీ ఆర్మీ దినోత్సవం జూన్ 14న జరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..