సీన్ మారిన వరల్డ్ వార్.. డ్రోన్స్, మిస్సైల్స్, జెట్ ఫైటర్స్ తూచ్.. అణు బాంబులేనా?
మాట్లాడితే తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో లేవో తెలీదు గానీ.. పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి మరీ ఇజ్రాయెల్‌పై వేస్తాం అనేలా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. మొన్న పాకిస్తాన్ కూడా అలాంటి బెదిరింపులకే దిగి సైలెంట్ అయింది. అంతకు ముందు ఉక్రెయిన్‌తో యుద్ధం సందర్భంగా అవసరమైతే అణుబాంబు తీస్తామన్నారు పుతిన్. దీన్ని బట్టి అర్థమవుతున్నదేంటంటే.. మున్ముందు మిస్సైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్స్‌తో కాదు అణుబాంబులతో యుద్ధం జరిగేది.

ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ నక్కాడో పక్కాగా తెలిసిన సమయం అది. వెంటనే ఆపరేషన్ నెప్ట్యూన్ స్పిరిట్‌ను మొదలుపెట్టింది అమెరికన్ ఆర్మీ. మెరికల్లాంటి కమాండోలను పాకిస్తాన్‌లోని అబోత్తాబాద్‌కు పంపింది. లాడెన్ ఇంట్లో కమాండోలు వేస్తున్న ప్రతి అడుగును అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా లైవ్‌లో చాలా ఉత్కంఠగా చూస్తూ కూర్చున్నారు అప్పుడు. గుర్తుందా.. ఆనాటి ఫొటో బాగా వైరల్ అయింది. అప్పుడు ఒబామా వెళ్లింది కూర్చుంది, కమాండో ఆపరేషన్‌ను లైవ్‌లో చూసింది ఎక్కడో తెలుసా. ‘సిచ్యుయేషన్ రూమ్’. మళ్లీ ఇన్నాళ్లకు ‘సిచ్యుయేషన్ రూమ్’ పేరు వినిపించింది. ఓవైపు G-7 సమావేశాలు జరుగుతున్నా సరే.. అక్కడి నుంచి చాలా హడావుడిగా వచ్చేశారు ట్రంప్. వైట్‌హౌస్‌లో సిచ్యుయేషన్ రూమ్‌ను రెడీ చేశారు. ఏదో భారీ ఆపరేషన్ జరగబోతున్నప్పుడు మాత్రమే దాన్ని వాడతారు. అంటే అర్ధం.. ఊహించనిదేదో ప్రపంచం చూడబోతోందని. ఇంతకీ ఏంటది? అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఏదో చేయబోతున్నాయి. ఏమై ఉంటుందది. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధమంతా ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమే. అదే జరగబోతోందా? అందులోనూ… యుద్ధానికి దిగుతున్న ప్రతీ దేశం న్యూక్లియర్ బాంబుల గురించే మాట్లాడుతున్నాయి. అంటే… మున్ముందు జరిగేవి అణుయుద్ధాలేనా? ఉక్రెయిన్‌తో యుద్ధంలో బిజీగా ఉన్నా సరే… రష్యా తన IL-76 రవాణా విమానాన్ని ఇరాన్‌కు పంపించింది. అది అలాంటి ఇలాంటి విమానం కాదు. హెవీ మెషిన్స్‌ను మోసుకెళ్లగలదు. ఏవో ఎక్విప్‌మెంట్స్ పంపించాలనుకుంటే అంత పెద్ద విమానం వాడదు రష్యా. డెఫినెట్‌గా అణుబాంబులే సప్లై...