Heavy Rains: పలు రాష్ట్రాల్లో వరుణ బీభత్సం.. వరదలతో కొట్టుకుపోతున్న బైకులు, ఆటోలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. భావ్‌నగర్ సిహోర్‌లో వరదలు ముంచేస్తున్నాయి. ఈ వరదల్లో బైకులు, ఆటోలు, స్కూటీలు తదితర వస్తువులు సైతం కొట్టుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదుగురు కార్మికులతో ప్రయాణిస్తున్న బస్సు కూడా సావర్కుండ్ల తాలూకాలో చిక్కుకుంది. స్థానిక గ్రామస్తులు వారిని సురక్షితంగా రక్షించారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాల కారణంగా గుజరాత్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భావ్‌నగర్, అమ్రేలి జిల్లాల్లో వరుణ బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. భావ్‌నగర్ సిహోర్‌లో వరదలు ముంచేస్తున్నాయి. ఈ వరదల్లో బైకులు, ఆటోలు, స్కూటీలు తదితర వస్తువులు సైతం కొట్టుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రఖ్యాత జైన పుణ్యక్షేత్రం పాలిటానాలో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య 286 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం వర్షపాతంగా వాతావరణ శాఖ వెల్లడించింది. వరదలతో వీధులు నదులుగా మారాయి. సమీపంలోని సిహోర్, మహువా, వల్లభిపూర్ నుండి రోడ్లు తెగిపోయాయి. చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్ స్థభించిపోయింది.
వీడియో ఇక్కడ చూడండి..
భావ్‌నగర్‌లోని మహువా తాలూకాలో తల్గజార్దా గ్రామం సమీపంలో అకస్మాత్తుగా వరద పొటెత్తటంతో మోడల్ హైస్కూల్‌కు చెందిన 38 మంది విద్యార్థులు తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా రూపవ్ నది పొంగిపొర్లింది. రాటోల్-తల్గజార్దా రహదారి మునిగిపోయింది. పడవలు, ట్రాక్టర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. ఎట్టకేలకు పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
అమ్రేలి జిల్లాలో, పిపావావ్ ధామ్ వద్ద పెరుగుతున్న నీటి ఉప్పెనలో చిక్కుకున్న 22 మందిని కోస్ట్ గార్డ్ బృందం రక్షించింది. ఐదుగురు కార్మికులతో ప్రయాణిస్తున్న బస్సు కూడా సావర్కుండ్ల తాలూకాలో చిక్కుకుంది. స్థానిక గ్రామస్తులు వారిని సురక్షితంగా రక్షించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




