Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే లెమన్‌ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు..!

లెమన్ గ్రాస్ ఒక సూపర్ హెర్బ్. యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ తో మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మగడ్డి సువాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. లెమన్‌ గ్రాస్‌ టీని తీసుకుంటే నిద్రలేమి సమస్య కూడా పరిష్కారమవుతుందని నిపుణులు చెబుతున్నారు. లెమన్‌ గ్రాస్‌ లాభాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jun 17, 2025 | 6:05 PM

Share
లెమన్ గ్రాస్ టీని రోజూ తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపునొప్పి, మలబద్దకం, కడుపు నొప్పి వంటి సమస్యలన్నీ మంత్రించినట్టు తగ్గుతాయి.  లెమన్ గ్రాస్ లో సిట్రల్, జెరేనియం అనే రెండు యాంటీ ఇన్ప్లమేటరీ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

1 / 5
లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల గట్ లో మంచి బ్యాక్టీరియా పరిమాణం పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ టీ ని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ప్రతిరోజూ ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ప్రేగు కదలిక సాఫీగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

2 / 5
యాంటీఆక్సిడెంట్స్,  యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ టీ శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

3 / 5
లెమన్ గ్రాస్ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లలో వాపు, నొప్పి తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
ఉదయాన్నే లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఇది టెన్షన్లను తగ్గించి, మెదడును రిలాక్స్ చేస్తుంది. ఇది తలనొప్పి సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే నిద్రలేమిని దూరం చేస్తుంది.

లెమన్ గ్రాస్ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లలో వాపు, నొప్పి తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఉదయాన్నే లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఇది టెన్షన్లను తగ్గించి, మెదడును రిలాక్స్ చేస్తుంది. ఇది తలనొప్పి సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే నిద్రలేమిని దూరం చేస్తుంది.

4 / 5
లెమన్ గ్రాస్ టీ తయారీ కోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని వేడి చేసుకోవాలి. ఇందులోనే లెమన్ గ్రాస్ ఆకులు వేసి కాసేపు మరగనివ్వాలి. టీ రెడీ అయ్యాక వడకట్టి సర్వ్‌ చేసుకోవాలి. మీకు కావాలంటే రుచి కోసం తేనెను కలుపుకోవచ్చు. రోజుకు రెండుసార్లు ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

5 / 5