Onion Side Effects: ఉల్లిపాయలు పచ్చిగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..! తస్మాత్‌ జాగ్రత్త..

పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నోటి దుర్వాసన ఏర్పడుతుంది. కళ్లకు చికాకు కలిగిస్తుంది. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. అక్కడ పేగులపై చెడు ప్రభావం చూపుతుంది. సాల్మొనెల్లా అనేది ఆహార సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది పేగులను

Onion Side Effects: ఉల్లిపాయలు పచ్చిగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..! తస్మాత్‌ జాగ్రత్త..
Onion Side Effects
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 01, 2023 | 9:27 PM

ఉల్లిపాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి. అయితే, ఉల్లిపాయలో శరీరానికి ప్రయోజనాలు కలిగించే అనేక రకాల పోషక విలువులు ఉంటాయనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం.  ఉల్లిపాయ.. భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే కూరగాయలు. ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీర కండరాలు బలపడతాయి. ఉల్లిపాయ కంటి ఆరోగ్యానికి మంచిది. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఐరన్, సెలీనియం, ఫైబర్, క్వెర్సెటిన్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తరచుగా ఉల్లిపాయ తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటారు.

అంతేకాకుండా, ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీకాన్సర్, యాంటీఆక్సిడెంట్, యాంటిథ్రాంబోటిక్ లక్షణాలు ఉన్నాయి. అయితే పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.  పచ్చి ఉల్లిపాయ అతిగా తింటే.. ఎసిడిటీ సమస్య రావొచ్చని కూడా ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పచ్చి ఉల్లిపాయలను తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పచ్చి ఉల్లిపాయతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, దీని అధిక వినియోగం కడుపు నొప్పి, గుండెల్లో మంటను కలిగిస్తుంది. ఇది వాంతులు, వికారం కూడా కలిగిస్తుంది.

ఉల్లిపాయల్లో గ్లూకోజ్ ఇంకా  ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటాయి.  ఇందులో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి పచ్చి ఉల్లిపాయ అతిగా తినటం వల్ల జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లిపాయను ఎక్కువగా తింటే ఎగ్జిమా వస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నోటి దుర్వాసన ఏర్పడుతుంది. కళ్లకు చికాకు కలిగిస్తుంది. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. అక్కడ పేగులపై చెడు ప్రభావం చూపుతుంది. సాల్మొనెల్లా అనేది ఆహార సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది పేగులను ప్రభావితం చేస్తుంది. వివిధ రకాల కడుపు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. అలాగే, గర్భిణీ స్త్రీలు కూడా పచ్చి ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులోని పొటాషియం మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. మీరు మలబద్ధకంతో బాధపడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!