AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: మహిళల్లో ఎముకల నొప్పికి కారణం ఇదే! ఈ ఆహారాలను అలవాటు చేసుకోండి.

నువ్వులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్లాక్‌ సిడ్స్‌.. ఇవే అవిసె గింజలు.. ఇందులో ఫైటో ఈస్ట్రోజెన్‌లు అధికంగా ఉంటాయి. అవిసె గింజల్లో లెనోలేనిక్ ఆమ్లాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను మెరుగుపరుస్తాయి.

Women Health: మహిళల్లో ఎముకల నొప్పికి కారణం ఇదే! ఈ ఆహారాలను అలవాటు చేసుకోండి.
Women Health
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2023 | 10:01 PM

Share

ప్రస్తుతం మహిళల్లో ఎముకల నొప్పి సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా వయసు దాటిన మహిళలు వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు తదితర సమస్యలతో సతమతమవుతున్నారు. 40 ఏళ్ల తర్వాత స్త్రీ శరీరం అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా అధిక బరువు పెరగడం, వివిధ రకాల మానసిక ఒత్తిడి, నిద్రలేమి కాల్షియం లేకపోవడం వంటివి ఈ ఎముకలలో నొప్పికి కారణాలుగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి ప్రధాన కారణం మన శరీరానికి తగినంత పోషకాలు అందకపోవడమే. ఆహారంలో ఎక్కువ పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం అవసరం. కాబట్టి మహిళలు ఇలాంటి బెస్ట్ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

బాదం..

బాదంపప్పులో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. అవి మోనోశాకరైడ్లు. ప్రోటీన్ల నిధిగా చెబుతారు. మీరు రోజుకు ఒక కప్పు బచ్చలికూర, ఖర్జూరాలు, బంగాళదుంపలు, వాల్‌నట్‌లను కూడా తినవచ్చు. వాల్‌నట్స్ పప్పులో ఆక్సిడేషన్ ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. అందువల్ల ఇన్ఫమ్లేషన్ తగ్గి కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

పాలు, పాల పదార్థాలు..

పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ మొదలైనవి కాల్షియం ముఖ్యమైన వనరులు. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. కాబట్టి మహిళలు వీటిని తగినంతగా తీసుకోవడం మంచిది.

బ్రోకలీ, బచ్చలి కూర..

బ్రోకలీ కాల్షియం మంచి మూలం. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్ కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే, 40 దాటిన మహిళలు బ్లాక్ బీన్స్ ఎక్కువగా తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే.. బ్లాక్‌ బీన్స్‌లో మెగ్నీషియం, పోటాషియం పుష్కలంగా ఉంటాయి. బచ్చలి కూరలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను తొలగించి వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతుంది.

నువ్వులు, అవిసె గింజలు..

నువ్వులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్లాక్‌ సిడ్స్‌.. ఇవే అవిసె గింజలు.. ఇందులో ఫైటో ఈస్ట్రోజెన్‌లు అధికంగా ఉంటాయి. అవిసె గింజల్లో లెనోలేనిక్ ఆమ్లాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను మెరుగుపరుస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..