Viral Video:పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధువరులు.. షాక్‌లో అతిథులు.. వైరలవుతున్న వీడియో

అయితే ఇప్పుడు వధూవరుల వింత వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు తమ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నెటిజన్లు ఈ జంట కెమిస్ట్రీ, అద్భుతమైన ప్రదర్శనను అభినందిస్తున్నారు. వారి డ్యాన్స్‌ ఒక అద్భుతమైన క్షణంగా అభివర్ణిస్తున్నారు. ప్రేక్షకులు వీరిపై ప్రశంసలు, ప్రేమను కుమ్మరిస్తున్నారు.

Viral Video:పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధువరులు.. షాక్‌లో అతిథులు.. వైరలవుతున్న వీడియో
Marriage
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 01, 2023 | 7:04 PM

నేటి ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవితాల్లో ముఖ్యభాగంగా ముడిపడిపోయింది. ఇంటర్నెట్ ఒక ప్రత్యేక ప్రపంచంలా పనిచేస్తుంది. ఇక్కడ మనం చాలా విభిన్న విషయాల గురించి తెలుసుకుంటాం. ఇక్కడ షేర్ చేయబడిన అనేక విషయాలు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక సందేశాలను అందిస్తాయి. ఇది ఉపయోగకరమైన సమాచారంతో పాటు వినోద మార్గంగా కూడా ఉంటాయి.. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే టెన్షన్‌ల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. వీటిలో పెళ్లి వీడియోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

ప్రతిరోజూ సోషల్ మీడియాలో చాలా ఫన్నీ వెడ్డింగ్ వీడియోలు షేర్ అవుతున్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో భిన్నమైనవిగా ఉంటాయి. కొన్నిసార్లు పెళ్లయిన జంటలు అందంగా డ్యాన్స్ చేయడం, కొన్నిసార్లు ప్రేమగా మాట్లాడుకోవడం, కొన్నిసార్లు ముద్దులు పెట్టుకోవటం మనం చూశాము. అయితే ఇప్పుడు వధూవరుల వింత వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

వెడ్డింగ్ డ్యాన్స్ చూడటానికి ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ప్రాక్టీస్ చేసినా లేదా అలవోకగా చేసినా.. ఆ డ్యాన్స్‌ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. తాజాగా వధూవరులు లైవ్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసింది. వేదికపైకి రాగానే రొమాంటిక్ పాటలకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. చాలా మంది ఈ వీడియోను అభినందిస్తున్నారు. చాలా మంది వీరి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో Instagram పేజీ @chankaaar లో షేర్ చేయబడింది. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Aadya Gupta (@chankaaar)

వధూవరుల అద్భుతమైన డ్యాన్స్‌ ప్రేక్షకుల హృదయాలను దోచుకునేలా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియో గత నెల జూలై 9న షేర్ చేయబడింది. విడుదలైనప్పటి నుంచి ఈ వీడియోను దాదాపు 10 లక్షల మందికిపైగా వీక్షించారు. ప్రస్తుతం కామెంట్ బాక్స్‌లో 33 వేల లైక్‌లు, వందల కొద్దీ రియాక్షన్‌లు వచ్చాయి.

వరుడి కోసం వధువు చేసిన రొమాంటిక్ డ్యాన్స్ అందరికీ ఎంతగానో నచ్చింది. వరుడు ప్రతి డ్యాన్స్ స్టెప్పును చాలా అద్భుతంగా ప్రదర్శించాడు. ఈ డ్యాన్స్‌షో కోసం వధూవరులు ఫుల్‌ ప్రాక్టీస్‌తో వచ్చినట్టుగా తెలుస్తోంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు తమ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నెటిజన్లు ఈ జంట కెమిస్ట్రీ, అద్భుతమైన ప్రదర్శనను అభినందిస్తున్నారు. వారి డ్యాన్స్‌ ఒక అద్భుతమైన క్షణంగా అభివర్ణిస్తున్నారు. ప్రేక్షకులు వీరిపై ప్రశంసలు, ప్రేమను కుమ్మరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే