- Telugu News Photo Gallery Get a chance to visit these wonderful places by booking irctcs nepal tour Telugu News
IRCTC బంపర్ ఆఫర్.. అతి తక్కువ ఖర్చు, అని వసతులతో నేపాల్ దర్శనం..! ఇవి పూర్తి వివరాలు..
మీరు వింటర్ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారా..? నవంబర్‌లో ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తున్నట్టయితే.. IRCTC అద్భుతమైన నేపాల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్రయాణం చండీగఢ్ నుండి ప్రారంభమవుతుంది.
Updated on: Sep 01, 2023 | 4:34 PM

భారతదేశం పొరుగున ఉన్న నేపాల్ దాని అందమైన ప్రకృతి రమణీయతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశం నుండి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శిస్తారు.

విమాన ప్యాకేజీ: ఈ ప్యాకేజీతో మీరు ఖాట్మండు, పోఖారాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. చండీగఢ్ నుండి ఖాట్మండుకు ప్రత్యేక విమాన ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

6 రోజులు, 5 రాత్రులు: ఈ ప్యాకేజీ' నవంబర్ 4, 2023న ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో మొత్తం 6 పగళ్లు, 5 రాత్రులు ఉంటాయి. ఇందులో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం ఉంటాయి.

3 స్టార్ హోటళ్లలో వసతి: ఈ ప్యాకేజీలో 3 స్టార్ హోటల్‌లో వసతి ఉంటుంది. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంటుంది.

ఛార్జీల వివరాలు: ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి మీరు ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే.. రూ.50,500, ఇద్దరు వ్యక్తులకు రూ.42,500 ముగ్గురికి రూ.42,100 తగ్గింపుతో లభిస్తుంది.




