- Telugu News Photo Gallery Cricket photos Asia Cup 2023 What happens if India vs Pakistan match is canceled due to rain check here full details
Asia Cup 2023: వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. టీమిండియా పరిస్థితి ఎలా ఉండనుందంటే?
India vs Pakistan Asia Cup Match Weather Report: ఆసియా కప్ 2023లో సెప్టెంబర్ 2న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అలా అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది? మ్యాచ్‌కి రిజర్వ్ డే ఉంటుందా? పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 01, 2023 | 3:58 PM

శనివారం జరగనున్న ఆసియా కప్ 2023 మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. చిరకాల ప్రత్యర్థులు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్లు సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి.

అయితే ఈ ఇండో-పాక్ హైవోల్టేజీ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. AccuWeather.com ప్రకారం, పల్లెకెలెలో వర్షం పడే అవకాశం 94 శాతం ఉంది. అలాగే పిడుగులు పడే అవకాశం 27 శాతంగా ఉంది. మ్యాచ్ సందర్భంగా 97 శాతం మేఘావృతమైన వాతావరణం ఉంటుందని సమాచారం.

ఆగస్టు-సెప్టెంబర్ సాధారణంగా శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తాయి. అందువల్ల లంక క్రికెట్ బోర్డు ఈ నెలల్లో ఏ మ్యాచ్‌ను షెడ్యూల్ చేయదు. అయితే పాకిస్థాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో.. శ్రీలంక తన దేశంలోనే ఆసియాకప్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వడం అనివార్యమైంది.

సెప్టెంబరు 2న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ మాత్రమే కాదు.. సెప్టెంబర్ 4న భారత్-నేపాల్ మధ్య జరగనున్న మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. సెప్టెంబర్ 4వ తేదీన 76 వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఐతే భారత్-పాక్ పోరుకు వర్షం అంతరాయం ఏర్పడి మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది? వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభమైన కాసేపటి తర్వాత ఆగిపోయి, ఇంకా సమయం ఉంటే ఇరు జట్లూ ఆడాలనే నిబంధన ఉంది. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

రెండో ఇన్నింగ్స్‌కు ముందు వర్షం లేదా వర్షం కారణంగా రెండో బ్యాటింగ్‌కు అంతరాయం ఏర్పడితే, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు స్కోరు, రెండో బ్యాటింగ్ చేసే జట్టు బౌల్ చేయాల్సిన ఓవర్ల సంఖ్యలో ఒక శాతంతో లెక్కిస్తుంటారు.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే రిజర్వ్ డే షెడ్యూల్ ఉండదు. బదులుగా, భారత్-పాకిస్తాన్ జట్టుకు ఒక్కొక్క పాయింట్ ఇవ్వబడుతుంది. ఈ సందర్భంలో ఆగస్టు 30న ముల్తాన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి పాకిస్థాన్ సూపర్ 4 దశకు అర్హత సాధిస్తుంది. సెప్టెంబరు 4న పల్లెకెలెలో జరిగే తన తదుపరి మ్యాచ్‌లో భారత్ నేపాల్‌ను ఓడించాల్సి ఉంటుంది.

పల్లెకెలె వేదికగా టీమిండియా ఇప్పటి వరకు మూడు వన్డేలు మాత్రమే ఆడింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసి ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా విజయం సాధించింది. కాబట్టి ఈ మైదానం భారతదేశానికి ఇష్టమైనదిగా చెప్పవచ్చు.




