- Telugu News Photo Gallery Cinema photos Actress Rashmika Mandanna Exit from Crazy combination in Telugu Movie For North Movies Telugu Actress Photos
Rashmika Mandanna: ఆ ఇంట్రస్ట్ కారణంగా సౌత్‌లో ఆఫర్స్ వదిలేస్తున్న మేడమ్.. రష్మిక.
ప్రతిసారీ మనం వేసే ప్రతి అడుగూ పాజిటివ్ వైపే వెళ్తుందని ఎందుకు అనుకోవాలి.? రిస్క్ ఉంటుంది. అయితే ఆ రిస్క్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామన్నది ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్ లో నేషనల్ క్రష్ చేసిన ఓ పని రిస్కులో పడేసింది. వాట్ నెక్స్ట్ అంటే, ఫోకసింగ్ ఆన్ ప్రెజెంట్ ఫ్రాజెక్ట్స్ అని అంటున్నారు. ఆ డీటైల్స్ చూద్దాం. ఎంత పని చేశావ్ శ్రీవల్లీ అని సానుభూతి తెలుపుతున్నారు సన్నిహితులు. అంతలా అందరూ పాపం అని అనడానికి రీజన్ ఏంటీ అని ఆరాతీస్తే..
Updated on: Sep 01, 2023 | 6:01 PM

ప్రతిసారీ మనం వేసే ప్రతి అడుగూ పాజిటివ్ వైపే వెళ్తుందని ఎందుకు అనుకోవాలి? రిస్క్ ఉంటుంది. అయితే ఆ రిస్క్ ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామన్నది ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్ లో నేషనల్ క్రష్ చేసిన ఓ పని రిస్కులో పడేసింది.

వాట్ నెక్స్ట్ అంటే, ఫోకసింగ్ ఆన్ ప్రెజెంట్ ఫ్రాజెక్ట్స్ అని అంటున్నారు. ఆ డీటైల్స్ చూద్దాం. ఎంత పని చేశావ్ శ్రీవల్లీ అని సానుభూతి తెలుపుతున్నారు సన్నిహితులు. అంతలా అందరూ పాపం అని అనడానికి రీజన్ ఏంటీ అని ఆరాతీస్తే, నార్త్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేయడం వల్ల సౌత్‌లో ఓ క్రేజీ కాంబినేషన్‌ని మేడమ్ వదులుకున్నారనే విషయం బయటపడింది.

ఆ సంగతి ఇలా బయటపడిందో లేదో, అప్పుడే వైరల్ అయింది. టాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా డిస్కషన్ జరుగుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఆ మధ్య ఓ సినిమాకు సైన్ చేశారు రష్మిక మందన్న.

అయితే కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోతున్నానంటూ సగంలోనే డ్రాప్ అయ్యారు. అరే.. ఆల్రెడీ హిట్ కాంబో అని పేరున్నప్పుడు ఎలాగోలా డేట్లు అడ్జస్ట్ చేస్తే పోయేదిగా.. రష్మిక ఎందుకు ఇలా చేసినట్టు అని అప్పట్లోనే చాలా మంది అవాక్కయ్యారు.

షాహిద్ కపూర్ పక్కన సినిమా అనేసరికి నితిన్ మూవీకి గుడ్‌బై చెప్పేశారు రష్మిక. అయితే డైరక్టర్ అనీస్ బజ్మీతో షాహిద్‌కి అభిప్రాయభేదాలు రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో ఈ కాల్షీట్లన్నీ ఉన్నపళంగా వేస్ట్ అయ్యాయి. ప్రస్తుతం పుష్ప2లో నటిస్తున్నారు రష్మిక.

పుష్ప2 సినిమాతో పాటు నార్త్ లో రణ్‌బీర్‌కపూర్‌తో యానిమల్ సినిమా ఉంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్లలో ఈ సారి గట్టిగా పార్టిసిపేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. షాహిద్ సినిమాకి ఇచ్చిన డేట్లల్లో ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారట మేడమ్. త్వరలోనే ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారట.




