- Telugu News Photo Gallery Cinema photos Rowdy Boy Vijay Devarakonda saying about His Marriage Update Telugu Entertainment Photos
Vijay Devarakonda: తెలివైన అమ్మాయి, నా ఇష్టాలను ఇష్టపడే అమ్మాయి అయితే చాలు: విజయ్ దేవరకొండ.
ఇన్నాళ్లూ వెయిట్ చేసిన డేట్ రానే వచ్చేసింది. సెప్టెంబర్ 1న ఖుషి రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పర్ఫెక్ట్ మూవీ కోసం ఆయన కన్నా ఇష్టంగా చూస్తున్నారు రౌడీ బోయ్స్. ఆల్రెడీ విజయ్‌కి కలిసొచ్చిన ఓ సెంటిమెంట్‌ని ఖుషితో ముడిపెట్టి మరీ హిట్ వైబ్స్ ఉన్నాయంటూ సెలబ్రేషన్ మోడ్ స్టార్ట్ చేసేశారు. లైగర్‌తో ప్యాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. యాక్షన్ మోడ్‌లో ఆయన చూపించిన టాలెంట్ బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు.
Updated on: Sep 01, 2023 | 4:44 PM

ఇన్నాళ్లూ వెయిట్ చేసిన డేట్ రానే వచ్చేసింది. సెప్టెంబర్ 1న ఖుషి రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పర్ఫెక్ట్ మూవీ కోసం ఆయన కన్నా ఇష్టంగా చూస్తున్నారు రౌడీ బోయ్స్.

ఆల్రెడీ విజయ్‌కి కలిసొచ్చిన ఓ సెంటిమెంట్‌ని ఖుషితో ముడిపెట్టి మరీ హిట్ వైబ్స్ ఉన్నాయంటూ సెలబ్రేషన్ మోడ్ స్టార్ట్ చేసేశారు. లైగర్‌తో ప్యాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. యాక్షన్ మోడ్‌లో ఆయన చూపించిన టాలెంట్ బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు.

దాన్ని తలచుకుని డీలాపడలేదు విజయ్ . ''ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఓ సారి పరాజయాన్ని చూస్తారు. దాన్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఫెయిల్ అయితే ఫీల్ కావాల్సిన అవసరం లేదు'' అన్నది విజయ్ దేవరకొండ నమ్మే కాన్సెప్ట్.

అర్థం చేసుకున్నారు కాబట్టే, లైగర్ వైబ్స్ ని దాటుకుని ఖుషితో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమాలో ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటకు జీవితంలో ఎదురైన అనుభవాలను చూపించారు కెప్టెన్ శివ నిర్వాణ.

ఆల్రెడీ విజయ్‌కి కలిసొచ్చిన పెళ్లి కాన్సెప్టుతోనే తెరకెక్కింది ఖుషి. పెళ్లి కాన్సెప్ట్ కలిసొచ్చింది కదా.. అని ఎవరైనా రౌడీ హీరోతో అంటే చాలు... 'లేని పోని సెంటిమెంట్లు పెట్టొద్దండీ. అదే నిజమైతే, ప్రతి సినిమాలోనూ ఓ పెళ్లి సీను పెట్టాల్సి వస్తుంది' అంటూ చమత్కరిస్తారు రౌడీ హీరో.

రియల్ లైఫ్ పెళ్లి గురించి కూడా హింట్ ఇచ్చారు విజయ్. తనకు చేసుకోవాలని అనిపించినప్పుడు చేసుకుంటానని, అది కూడా చాలా సింపుల్‌గా చేసుకుంటానని, ఎవరికీ చెప్పనని అన్నారు. తెలివైన అమ్మాయి, తనను ఇష్టాలను ఇష్టపడే అమ్మాయి దొరికితే చాలన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం నటన మీదే ఉందని, లైఫ్‌లో ఎప్పుడో ఓ సారి డైరక్షణ్ కూడా చేస్తానని చెప్పారు విజయ్.




