- Telugu News Photo Gallery Cinema photos TV Actress Aishwarya Pisse to Enter in Bigg Boss 7 telugu telugu cinema news
Bigg Boss 7 Telugu: చివరి క్షణంలో హ్యాండిచ్చిన నటి.. ఆ సీరియల్ హీరోయిన్‍ను ఫైనల్ చేసిన బిగ్బాస్ టీం..
మరో రెండు రోజుల్లో బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 సందడి షూరు కాబోతుంది. ఎప్పటిలాగే అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. సోషల్ మిడియాలో మాత్రం కంటెస్టెంట్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఫైనల్ మెంబర్స్ వీళ్లే అంటూ ఓ లీస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా..చివరిక్షణంలో ఓ నటి ట్విస్ట్ ఇచ్చిందని.. దీంతో మరో బుల్లితెర హీరోయిన్ ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
Updated on: Sep 01, 2023 | 8:24 PM

బుల్లితెరపై గుండమ్మ కథ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది పూజా మూర్తి. బిగ్ బాస్ సీజన్ 7కు పూజా సెలక్ట్ అయిందని టాక్ నడిచింది. ఇక చివరి క్షణంలో ఆమె సీజన్ 7లో పాల్గొనడం లేదట. దీంతో మరో కథానాయిక ఐశ్వర్య పిస్సేను తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

అగ్నిసాక్షి సీరియల్ తో గౌరిగా తెలుగు వారికి పరిచయమయ్యింది ఐశ్వర్య. ప్రస్తుతం ఆమె కస్తూరి సీరియల్లో లీడ్ రోల్ చేస్తుంది. కన్నడలో ముందుగా రెండు సీరియల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది ఐశ్వర్య. ఆ తర్వాత మెయిన్ లీడ్ గా ఓ సీరియల్ చేసింది.

ఓ వైపు నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తి చేసిన ఆమె రెండు కన్నడ సినిమాల్లో నటించింది. కానీ సీరియల్స్ నుంచి ఎక్కువ అవకాశాలు రావడంతో సినిమాలకు కాకుండా బుల్లితెరపై ఫోకస్ పెట్టింది. ఇక ఇప్పుడు తెలుగులో రాణిస్తుంది.

అయితే ఇప్పుడు ఐశ్వర్య పేరు ఆకస్మాత్తుగా వినిపిస్తోంది. ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే. ఐశ్వర్య సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి అన్నయ్యను పెళ్లి చేసుకుంది.

చివరి క్షణంలో హ్యాండిచ్చిన నటి.. ఆ సీరియల్ హీరోయిన్‍ను ఫైనల్ చేసిన టీం..