AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అయ్య బాబోయ్‌.. నోటి నుంచి నిప్పులు కురిపిస్తున్న నెమలి.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

కొద్ది రోజుల క్రితం నెమలి ఆకాశంలో ఎగురుతున్న వీడియో వైరల్‌గా మారింది. అలా నెమలి ఆకాశంలో ఎగురుతున్నవీడియో చూసి వీక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. లైకులు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేశారు.నెమలి నోటి నుంచి నిప్పులు చిమ్ముతున్న దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

Watch Video: అయ్య బాబోయ్‌..  నోటి నుంచి నిప్పులు కురిపిస్తున్న నెమలి.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Peacock
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2023 | 3:44 PM

Share

నెమళ్లు ప్రపంచంలోని అత్యంత అందమైన జీవి. వీటిని 1963లో భారతదేశ జాతీయ పక్షిగా ప్రకటించారు. నెమళ్లు దాని ప్రత్యేకమైన రంగులతో ప్రజలను ఎంతగానో ఆకర్షించే పక్షిగా నిలిచింది. వర్షాకాలంలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆ సొగసు చూడతరమా అనిపిస్తుంది. అంతటి సౌందర్య దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అలాంటి అందమైన నెమలి.. ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు నెమలి నోటి వెంట నిప్పులు కురిపిస్తున్న పోస్ట్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు సైతం భయంతో వణికిపోతున్నారు. సినిమాల్లో, కార్టూన్ల షోలలో డ్రాగన్‌లు, డైనోసార్‌ల వంటి జంతువుల నోటి నుంచి నిప్పులు చిమ్మటం చూస్తుంటాం. అలాంటిది ఇక్కడ నెమలి నోటి నుంచి నిప్పులు చిమ్ముతున్న దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Inside History (@insidehistory)

నెమలి నోటి నుంచి నిప్పులు కురిపిస్తున్న షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో నెమలి పైకి చూస్తూ బిగ్గరగా అరుస్తుంది. దాని నోటి నుండి మంటలు వస్తున్నాయి. కానీ, నెమలి నిజానికి కక్కటం లేదు. అది అరుస్తున్నప్పుడు సూర్యకాంతి వల్ల ఇలాంటి దృశ్యం ఆవిష్కృతం అయింది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపించే నెమలి చాలా చలి ప్రదేశంలో ఉన్నట్లుంది. అలా ఊపిరి పీల్చుకున్నప్పుడు హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టుగా నోటి నుంచి పొగ రావటం కనిపించింది. అందులో సూర్యుని కాంతి ఎర్రటి నిప్పులా కనిపిస్తుంది. ఈ ప్రకృతి అందాలను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సూర్యకాంతి కారణంగా నెమలి నోటి నుంచి నిప్పులు చిమ్ముతున్నట్టుగా కనిపించింది. ఈ సీన్‌ చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది.ఈ వీడియో 12 లక్షలకు పైగా లైక్‌లతో షేర్ చేశారు నెటిజన్లు. చాలా మంది వీడియో ఎడిట్ చేశారని అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం నెమలి ఆకాశంలో ఎగురుతున్న వీడియో వైరల్‌గా మారింది. అలా నెమలి ఆకాశంలో ఎగురుతున్నవీడియో చూసి వీక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. లైకులు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..