AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి చిన్న వయసులోనే CA టాపర్‌గా నిలిచిన యువతి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం.. ఆమె స్కూల్‌ లైఫ్‌ ఎలా ఉండేదంటే..

గిన్నిస్‌ రికార్డ్‌ సాధించాలంటే.. చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలుసుకుంది. ఇక అప్పటి నుంచే తను గిన్నిస్‌ రికార్డు సాధించాలని కలలు కంటూ ఉండేది. దానికోసమే నందిని సి.ఎ. పరీక్షపై మనసు పెట్టింది. నందిని అగర్వాల్ చాలా చిన్న వయస్కురాలు కావటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టం.16 ఏళ్ల వయసులో చిన్న కంపెనీలు కూడా తనను తీసుకోవడానికి నిరాకరించాయని చెప్పింది.

అతి చిన్న వయసులోనే CA టాపర్‌గా నిలిచిన యువతి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం.. ఆమె స్కూల్‌ లైఫ్‌ ఎలా ఉండేదంటే..
Morenas Nandini Agarwal
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 01, 2023 | 2:59 PM

19 ఏళ్ల వయసులో ఓ యువతి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో యువతి.. చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కిరీటం కైవసం చేసుకుంది. నందిని అగర్వాల్ ఎప్పుడూ హడావిడిగా ఉండేది. పాఠశాల విద్యలో కూడా రెండు క్లాస్‌లు జంప్‌ చేసి.., 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌ రాసింది.. ఆపై 15 ఏళ్ల వయసులో 12వ తరగతి పాసైంది. 19 సంవత్సరాల వయస్సులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. నందిని అగర్వాల్ మధ్యప్రదేశ్‌లోని మొరెనా అనే చిన్న పట్టణంలో జన్మించింది.. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా చార్టర్డ్ అకౌంటెంట్‌గా నందిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. 2021లో జరిగిన సీఏ ఫైనల్స్‌లో నందిని అగర్వాల్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 13 సెప్టెంబర్ 2021 నాటికి ఆమె ఈ ఫీట్ సాధించినప్పుడు ఆమె వయస్సు 19 సంవత్సరాల 330 రోజులు.

అలాగే నందిని సోదరుడు సచిన్ కూడా CA పరీక్షలో AIR 18వ ర్యాంక్ సాధించాడు. CA ఫైనల్స్ 2021లో నందిని 800 మార్కులకు 614 (76.75%) సాధించి 83,000 మంది అభ్యర్థులను అధిగమించి నంబర్‌గా నిలిచింది. నందిని అన్నయ్య సచిన్ అప్పటికి 21సంవత్సరాలు.. ఆల్ ఇండియాలో 18వ ర్యాంక్ సాధించాడు. 2021లో CA ఫైనల్‌లో నందిని 800 (76.75%) మార్కులకు 614 మార్కులు సాధించింది. 83,000 మంది అభ్యర్థులను ఓడించి దేశంలోనే నంబర్-1 ర్యాంక్ సాధించింది. అతని సోదరుడికి 568 మార్కులు వచ్చాయి.

నందిని 11వ తరగతి చదువుతున్నప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ తన స్కూల్‌కి వచ్చిందని చెప్పింది. గిన్నిస్‌ రికార్డ్‌ సాధించాలంటే.. చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలుసుకుంది. ఇక అప్పటి నుంచే తను గిన్నిస్‌ రికార్డు సాధించాలని కలలు కంటూ ఉండేది. దానికోసమే నందిని సి.ఎ. పరీక్షపై మనసు పెట్టింది. నందిని అగర్వాల్ చాలా చిన్న వయస్కురాలు కావటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టం.16 ఏళ్ల వయసులో చిన్న కంపెనీలు కూడా తనను తీసుకోవడానికి నిరాకరించాయని చెప్పింది.

ఇవి కూడా చదవండి

నందిని, ఆమె అన్నయ్య సచిన్ విక్టర్ కాన్వెంట్ స్కూల్‌లో కలిసే చదువుకున్నారు. వారిద్దరూ 2017లో మొరెనా జిల్లాలో 12వ తరగతి పరీక్షలో 94.5% మార్కులు సాధించి ఇద్దరు అగ్రస్థానంలో నిలిచారు. అయితే, తనకంటే.. పెద్దవాడైన నందిని అన్నయ్య సచిన్‌ తన కంటే రెండు తరగతులు ముందుండాలి. కానీ, తాను రెండు తరగతులు ముందుకెళ్లి 10వ తరగతి పరీక్ష రాసింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఒకే తరగతిలో కలిసి చదువుకున్నామని చెప్పింది.

తన విజయంలో అన్నయ్య చాలా కీలక పాత్ర పోషించాడని నందిని చెప్పింది.. తనకు మాక్ టెస్ట్‌లలో మార్కులు సరిగా వచ్చేవి కాదని..అది తనను నిరాశపరిచిందని చెప్పింది. మాక్ ఎగ్జామ్‌లోనే ఇలాంటి మార్కులు వస్తే అసలు పరీక్షలో ఎలా రాణిస్తానని భయం వేసేది అని చెప్పింది. కానీ, తన సోదరుడు తనకు ఎంతగానో సపోర్ట్‌ చేసినట్టుగా చెప్పింది. మాక్ టెస్ట్ రిజల్ట్స్‌ గురించి ఆలోచించకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండమని తనను అన్నయ్య ఎప్పుడూ ప్రోత్సహించేవాడని చెప్పింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..