Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2023 : ఆకాశమంత ప్రేమ.. 30వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కు రాఖీ కట్టిన సోదరి..

30వేల అడుగల ఎత్తున​ ఉన్నా, భూమి మీద ఉ‍న్న ఎక్కడున్నా బ్రదర్‌ అండ్‌ సిస్టం బాండింగ్‌ స్పెషల్‌ అంటూ ఈ వీడియోను ఇండిగో ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అందమైన క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతమైన ప్రశంసలు కురిపించారు.

Raksha Bandhan 2023 : ఆకాశమంత ప్రేమ.. 30వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కు రాఖీ కట్టిన సోదరి..
Raksha Bandhan
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 31, 2023 | 11:15 PM

రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ నేటి బిజీ లైఫ్ స్టైల్ పండుగ లేదా ప్రత్యేకమైన రోజుని మర్చిపోయేలా చేస్తుంది. అందుకు ఉదాహరణగా నిలిచే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ విమానయాన సంస్థ ఇండిగోలో పనిచేస్తున్న ఓ యువతి.. రాఖీ సందర్భంగా డ్యూటీలో ఉండగానే తన సోదరుడికి రాఖీ కట్టింది. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానంలో విధులు నిర్వహిస్తున్న ఆమె.. అదే విమానంలో పైలట్‌గా ఉన్న తన సోదరుడికి రాఖీ కట్టింది. ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ గా ఉన్న తన సోదరుడు గౌరవ్ కు అదే విమానంలో క్యూబిన్ క్రూ మెంబర్ గా ఉన్న శుభ రాఖీ కట్టింది. ఈ వీడియోను ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ అందమైన క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో… ఇండిగో విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో శుభ ప్రయాణీకులకు ఓ అనౌన్స్‌ ఇచ్చింది.. ఫ్లైట్ ఇంటర్‌ఫోన్ సిస్టమ్‌ ద్వారా ప్యాసింజర్స్‌తో తన మాటలను పంచుకుంది.. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాలాంటి ఉద్యోగులకు..తమ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి. ఈ రోజు నాకు, మా అన్న కెప్టెన్ గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పింది శుభ. ఎందుకంటే.. చాలా ఏళ్ల తర్వాత తామిద్దరం కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నామని చెప్పింది. అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టింది. ఆ వెంటనే అతడు కూడా ఆమె కాళ్లకు నమస్కారించి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు.

30వేల అడుగల ఎత్తున​ ఉన్నా, భూమి మీద ఉ‍న్న ఎక్కడున్నా బ్రదర్‌ అండ్‌ సిస్టం బాండింగ్‌ స్పెషల్‌ అంటూ ఈ వీడియోను ఇండిగో ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతమైన ప్రశంసలు కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!