Andhrapradesh: రైతు పొలంలో దొరికిన విలువైన వజ్రం.. కానీ, అదృష్టం అంతవరకే ఉంది.. ఏమైందంటే..

గత వారం రోజుల క్రితం మద్దికెర మండలం పెరవలి లో ఓ మహిళ పొలంలో కూలీ పనులు చేస్తుండగా 15 లక్షల విలువ చేసే వజ్రం లభించడంతో పెరవలి కి చెందిన వజ్రాల వ్యాపారి15 లక్షల నగదు, ఎనిమిది తులాలు బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. ప్రస్తుతం మరో వజ్రం దొరకడంతో వజ్రాల అన్వేషకులు వేట సాగిస్తున్నారు. దీంతో పంటపొలాల రైతులు బోరుమంటున్నారు.

Andhrapradesh: రైతు పొలంలో దొరికిన విలువైన వజ్రం.. కానీ, అదృష్టం అంతవరకే ఉంది.. ఏమైందంటే..
Diamond Found In Kurnool
Follow us
J Y Nagi Reddy

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2023 | 12:54 PM

ఒక్కరోజులోనే లక్షాధికారైన ఓ రైతు.. రెండు లక్షల విలువ చేసి వజ్రం లభించటంతో అతని అదృష్టం మారిపోయింది.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ ఉంరైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది ఆ వజ్రాన్ని జొన్నగిరి గ్రామానికి చెందిన వజ్రాల వ్యాపారి 2 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు అయితే ఆ రైతుకు దొరికిన వజ్రం ఎంత విలువ చేస్తుందో అని అవగాహన లేక వజ్రాన్ని రెండు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు అయితే ఆ వజ్రం విలువ దాదాపు 10 లక్షల రూపాయల విలువ చేస్తుందని ఇతర వజ్రాల వ్యాపారస్తులు చర్చించుకుంటున్నారు. దొరికిన వజ్రాలు ఎంత విలువ చేస్తాయని అవగాహన లేక వజ్రాల వ్యాపారులు ప్రజలను తక్కువ రూపాయలకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటు ప్రజలను మోసం చేస్తున్నారు.

గురువారం ఉదయం పొలానికి వెళ్ళిన రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది. మొదట్లో వజ్రమా కాదా అనే అనుమానంతో వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లి చూపించగా, అది వజ్రమే అని తేలింది. అయితే, దీని విలువ రెండు లక్షలు చేస్తుందని.. ఆ రైతుకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి పంపించాడు సదరు వజ్రాల వ్యాపారి. అయితే, ఈ విషయం ఆ నోట నూట ఈ నోట పడింది.. చివరకు వజ్రాల వ్యాపారుల కు తెలియడంతో ఆ వజ్రం తమకు ఇస్తే మేము 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఆ రైతు అవాక్కయ్యారు.. మళ్లీ తిరిగి వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లి అడగలేక కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే దొరికిన వజ్రం తీసుకున్న వ్యాపారి 2 లక్షల రూపాయలు ఇవ్వటంతో.. వచ్చిన డబ్బలు చాలు అనుకోని రైతు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో దాదాపుగా ఇప్పటి వరకు 30 వజ్రాలు పైగా దొరకడం, గత వారం రోజుల క్రితం మద్దికెర మండలం పెరవలి లో ఓ మహిళ పొలంలో కూలీ పనులు చేస్తుండగా 15 లక్షల విలువ చేసే వజ్రం లభించడంతో పెరవలి కి చెందిన వజ్రాల వ్యాపారి15 లక్షల నగదు, ఎనిమిది తులాలు బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. ప్రస్తుతం మరో వజ్రం దొరకడంతో వజ్రాల అన్వేషకులు పొలంలో ఎక్కువగా సంచరిస్తున్నారు. దీంతో రైతులు బోరుమంటున్నారు. ఓ వైపు వర్షాలు లేక తమ పొలాల్లో పంటలు పడడం లేదని ఆందోళన పడుతుంటే.. ప్రస్తుతం వజ్రాల కోసం వచ్చిన వాళ్ళు తమ పొలాలను పాడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే పొలాల్లో వజ్రాల అన్వేషణ చేయకూడదు.. అంటూ బోర్డులు పెట్టినప్పటికీ వజ్రాల అన్వేషకులు మాత్రం తగ్గకుండా రోజులు, వారాలు , నెలల తరబడి ఇక్కడే తిష్ట వేసి వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.