Viral Video: ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ‘స్పైడర్ మ్యాన్’గా మారిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియాలో ఒక పిల్లాడు ఒక పెద్ద బిల్డింగ్ రెయిలింగ్ అంచున వేలాడుతున్నాడు.  నాలుగో అంతస్తు రెయిలింగ్‌ను పట్టుకుని కిందకు వేలాడుతూ.. ఏ క్షణం అయినా అంత పై నుంచి  కిందపడిపోయేటట్లు కనిపిస్తున్నాడు. అయితే ఇంతలో ఆ బాలుడిని కాపాడడానికి దేవుడిలా ఒక యువకుడు ప్రత్యక్షం అయ్యాడు. తన ప్రాణాలను సైతం కూడా లెక్కచేయకుండా పిల్లవాడిని కాపాడానికి ప్రయత్నం చేశాడు.

Viral Video: ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు 'స్పైడర్ మ్యాన్'గా మారిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్
Shocking Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Sep 01, 2023 | 1:04 PM

మంచి చెడు.. సాయం చేసే గుణం.. స్వార్ధం ఇలా అన్ని గుణాలు కలిసిన ప్రజలు మనకు రోజూ కనిపిస్తూ ఉంటారు. కొందరు తాము మాత్రమే బాగుండాలని ఆలోచించే స్వార్ధపరులు ఉన్నట్లే.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడే వారు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు.. వారికి సహాయం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. తమ ప్రాణాలు సైతం ప్రమాదంలో పడినా ఇతరుల ప్రాణాలను రక్షించడానికి ఏదైనా చేస్తారు. ఇలాంటి మనుషుల గురించి ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు అనేకం తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే ప్రశంసల వర్షం కురిపిస్తారు.

వైరల్ అవుతున్న వీడియాలో ఒక పిల్లాడు ఒక పెద్ద బిల్డింగ్ రెయిలింగ్ అంచున వేలాడుతున్నాడు.  నాలుగో అంతస్తు రెయిలింగ్‌ను పట్టుకుని కిందకు వేలాడుతూ.. ఏ క్షణం అయినా అంత పై నుంచి  కిందపడిపోయేటట్లు కనిపిస్తున్నాడు. అయితే ఇంతలో ఆ బాలుడిని కాపాడడానికి దేవుడిలా ఒక యువకుడు ప్రత్యక్షం అయ్యాడు. తన ప్రాణాలను సైతం కూడా లెక్కచేయకుండా పిల్లవాడిని కాపాడానికి ప్రయత్నం చేశాడు. బిల్డింగ్ రెయిలింగ్ సహాయంతో కింద నుంచి పైకి ఎక్కడం ప్రారంభించాడు. స్పైడర్ మాన్ లా చకచకా ఎక్కడం మొదలు పెట్టాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఆ యువకుడు స్పైడర్‌మ్యాన్‌లా రూఫ్‌పైకి వేగంగా ఎక్కుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. కొద్ది సెకన్లలో నాలుగో అంతస్తుకు చేరుకుని రెయిలింగ్‌కు వేలాడుతున్న చిన్నారిని పైకి లాగి ప్రాణాలు కాపాడాడు. అయితే పైకి ఎక్కుతున్న సమయంలో ఎటువంటి భయపడలేదు సరికదా.. ఆ చిన్నారి ప్రాణాలను ఎలా కాపాడాలనే ధ్యేయంతో భవనం పైకి చేరుకున్నాడు.

షాకింగ్ కలిగించే ఈ వీడియో @MadVidss అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.  కేవలం 33 సెకన్ల ఈ వీడియో ఇప్పటివరకు 31 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. చాలా మంది వీడియోను లైక్ చేసి భిన్నమైన కామెంట్స్ చేశారు. ఈ యువకుడు ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’ అని కొందరంటే, ‘తన గురించి ఆలోచించకుండా ఆ చిన్నారి జీవితం గురించి ఆలోచించిన ఈ సూపర్‌హీరోకి సెల్యూట్‌’ అని కొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే