AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో వింత ప్రపంచం.. అన్న చెల్లెలికి పెళ్లి చేసే విచిత్ర దేశం..! ఎక్కడా, ఎందుకో తెలుసా..?

రోమన్ పాలనకు ముందు రాజకుటుంబం కానివారిలో తోబుట్టువుల వివాహాన్ని ఆచరించలేదని నిపుణులు చెబుతున్నారు. కానీ, తోబుట్టువుల మధ్య వివాహాలు అధిక సంఖ్యలో జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. కొత్త రాజ్యం 1550 BC నుండి 1070 BC ప్రారంభమైన తర్వాత ఈజిప్షియన్ పరిభాషలో వచ్చిన మార్పుల కారణంగా తోబుట్టువుల వివాహాలను గుర్తించడం కష్టంగా ఉంటుందని

ఇదో వింత ప్రపంచం.. అన్న చెల్లెలికి పెళ్లి చేసే విచిత్ర దేశం..! ఎక్కడా, ఎందుకో తెలుసా..?
Marriage
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2023 | 8:12 PM

Share

ఈజిప్టు రాజకుటుంబాల గురించి నమ్మలేని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. ఈజిప్టు రాజ కుటుంబంలో వారి ఇంట్లోని వారినే వివాహం చేసుకుంటారు. అయితే, దీని వెనుక ఏదైనా కారణం ఉందా? అంటే.. అవుననే సమాధానం వస్తుంది. ఈజిప్టులో అది రాయల్టీ ప్రజలైనా, లేదంటే సామాన్య కుటుంబాల వారైనా సరే.. వారి మొదటి ప్రయత్నం కుటుంబంలోని వారినే వివాహం చేసుకుంటారు. ఇక సామాన్యప్రజలలో తోబుట్టువుల వివాహాలు సర్వసాధారణం. 30 BC నుండి 395 AD వరకు వివాహాలు ఈ విధంగా కొనసాగాయి. ఇది రోమన్ రాచరికం ప్రభావ కాలం. ఈ కాలానికి ముందు సోదరులు, సోదరీమణుల మధ్య వివాహాలు జరిగిన కేసులు చాలా తక్కువగానే ఉన్నాయి.

ఈజిప్టులోని రాజ కుటుంబాల్లో అన్నా చెల్లెల్లు వివాహం చేసుకున్నారు. ఒక్కోసారి తండ్రి కూతురిని కూడా పెళ్లి చేసుకున్న ఘటనలు జరిగాయి. మార్సెలో కాంపాంకో తన ఈజిప్షియన్ మ్యారేజ్ ఆఫ్ ఎ గ్రేట్ క్యాచ్‌లో కొన్ని ఉదాహరణలను కూడా ఇచ్చాడు. ఉదాహరణకు 1961 BC నుండి 1917 BC వరకు పాలించిన సెన్వోరెట్ తన సోదరిని వివాహం చేసుకున్నాడు. 1525 BC నుండి 1504 BC వరకు పాలించిన అమెన్‌హోటెప్ I, 51 BC నుండి 40 BC వరకు పాలించిన అతని సోదరి క్లియోపాత్రా VIIని కూడా వివాహం చేసుకున్నాడు. ఇది కాకుండా రామెసెస్ II తన కుమార్తెను వివాహం చేసుకున్నట్లు చెబుతారు.

ఈజిప్షియన్ రాచరికంలో బహుళ భార్యలు కలిగి ఉండటం కూడా సహజంగా జరిగేవి. రాచరికంతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు తమ సోదరిని వివాహం చేసుకున్నారని నిపుణులు అంటున్నారు. ఈజిప్టు నాగరికతలో ఒసిరిస్‌ను ప్రధాన దేవతగా పరిగణించేవారు. ఐసిస్ అతని సోదరి అని నమ్ముతారు. ఈజిప్టు రాచరికంలో అతను భూమిపై ఒసిరిస్, ఐసిస్ నీడ అని ఒక నమ్మకం ఉంది. ఈ విధంగా అతను తనను తాను దేవుడిగా పేర్కొన్నాడు అంటారు.

ఇవి కూడా చదవండి

రోమన్ పాలనకు ముందు రాజకుటుంబం కానివారిలో తోబుట్టువుల వివాహాన్ని ఆచరించలేదని నిపుణులు చెబుతున్నారు. కానీ, తోబుట్టువుల మధ్య వివాహాలు అధిక సంఖ్యలో జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. కొత్త రాజ్యం 1550 BC నుండి 1070 BC ప్రారంభమైన తర్వాత ఈజిప్షియన్ పరిభాషలో వచ్చిన మార్పుల కారణంగా తోబుట్టువుల వివాహాలను గుర్తించడం కష్టంగా ఉంటుందని ఒలాపారియా సూచిస్తున్నారు. ఉదాహరణకు, ‘snt’ అనే పదాన్ని సాధారణంగా ‘సోదరి’ అని అనువదిస్తారు, కానీ కొత్త పాలనలో ఇది భార్య, ప్రియురాలికి కూడా ఉపయోగించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..