AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చావు ఇంటికి వెళ్లి ఏడ్చే వృత్తి.. ! కూలీ ఎంతంటే.. రుడాలి మహిళల కన్నీటి కథ…

గౌరవప్రదమైన కుటుంబంలో కుటుంబ సభ్యులు చనిపోతే మహిళలు ఏడవరు. సామాన్య ప్రజల ముందు తమ భావోద్వేగాలను ప్రదర్శించకుండా తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. అందువల్ల వారు చనిపోయినప్పుడు ఏడవడానికి రుడాలి సమాజానికి చెందిన మహిళలను కిరాయికి తీసుకుంటారు.

చావు ఇంటికి వెళ్లి ఏడ్చే వృత్తి.. ! కూలీ ఎంతంటే.. రుడాలి మహిళల కన్నీటి కథ...
Rudaalis
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2023 | 8:35 PM

Share

పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం.. ఇదే జీవితంలోని అసలు వాస్తవం.. మరణం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు తప్పక వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోతే ఆ కుటుంబమంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటారు. కొన్ని సంపన్న కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ప్రతిష్ట తగ్గుతుందని భావిస్తారు. అలాంటి కుటుంబాల వారికోసం కిరాయికి వచ్చి ఏడవటానికి కొందరు వ్యక్తులు ప్రత్యేకించి పనిచేస్తుంటారు. రాజస్థాన్‌లో అలాంటి ఒక సంఘం ఉంది. తక్కువ కులాల స్త్రీలను ఏడుపు కోసం నియమించుకునే ఆచారం ఉంది. వినటానికి వింతగా అనిపించినప్పటికీ.. అసలు వివరాల్లోకి వెళితే..

రుడాలి స్త్రీల కన్నీటి కథ..

దేశం ఆర్థికంగా, సాంకేతికంగా, సామాజికంగా ఎంత అభివృద్ధి చెందినా ముఖ్యంగా కుల వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉందని రాజస్థాన్‌లోని రుడాలి సంఘం నిరూపిస్తుంది. అగ్రవర్ణాల వారు చనిపోతే శవం ముందు ఏడవడానికి రుడాలి సంఘం మహిళలు కూలికి వస్తారు. ఊరిలో ఎవరైనా చనిపోతే నల్లటి దుస్తులు ధరించి మృతుడి ఇంటికి వెళ్లి ఏడుస్తారు. ముందుకు ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి మృతుడి నేపథ్యం తెలుసుకుంటారు..ఆ తరువాత, వారు గుంపుగా శవం ముందు కూర్చుని మరణించిన నేపథ్యాన్ని వివరిస్తూ ఏడుస్తారు. దుంఖంతో ఛాతీ కొట్టుకుంటూ శవం ముందు రోదిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

పశ్చిమ థార్ ఎడారి, రాజస్థాన్‌లో ఠాకూర్, రుడాలి కులాల్లోని మహిళలు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఠాకూర్ ఉన్నత కులం, ప్రతిష్టాత్మకమైన కుటుంబం అయితే, రుడాలిది తరతరాలుగా కష్టాల్లో కూరుకుపోతున్న సమాజం. ఇక్కడి అగ్రవర్ణాలు రుడాలి సమాజం పుట్టింది ఏడుపు కోసమేనని నమ్ముతారు.

గౌరవప్రదమైన కుటుంబంలో కుటుంబ సభ్యులు చనిపోతే మహిళలు ఏడవరు. సామాన్య ప్రజల ముందు తమ భావోద్వేగాలను ప్రదర్శించకుండా తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. అందువల్ల వారు చనిపోయినప్పుడు ఏడవడానికి రుడాలి సమాజానికి చెందిన మహిళలను కిరాయికి తీసుకుంటారు.

అయితే, ఇటీవల పెరుగుతున్న అక్షరాస్యత ఈ పద్ధతిని కొంతమేర తగ్గించింది. కానీ పూర్తిగా ఆగలేదు. ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాలు ఎవరైనా చనిపోతే ఏడవటమే వృత్తిగా చేసుకున్నారు.

మహాశ్వేతా దేవి రాసిన నవల ఆధారంగా 1993లో నిర్మించిన కల్పనా లాజ్మీ హిందీ డ్రామా మూవీ ‘రుడాలి’ రాజస్థాన్‌లోని వృత్తిపరమైన మహిళా దుఃఖితుల జీవితాలను తెరపైకి తెచ్చింది. రుడాలి అని పిలువబడే ఈ మహిళలు సాంప్రదాయకంగా రాష్ట్రంలోని రాజకుటుంబాలలో మరణించిన వారికోసం విలపించటానికి నియమిస్తారు. తరువాత, సిరోహి, జోధ్‌పూర్, బార్మర్, జైసల్మేర్, రాజస్థాన్‌లోని ఇతర సరిహద్దు ప్రాంతాలలో రాజ్‌పుత్ భూస్వాముల కుటుంబాలలో మరణాలకు సంతాపం తెలియజేయడానికి వారిని కూడా ఆహ్వానించడం ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..