Iron : ఐరన్‌ లోపాన్ని అశ్రద్ధ చేస్తే చాలా డేంజర్..! తరచుగా ఈ 5 ఆహారాలు తినడం అలవాటు చేసుకోండి..

Iron Effect: దేశంలో మూడోవంతు పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన

Iron : ఐరన్‌ లోపాన్ని అశ్రద్ధ చేస్తే చాలా డేంజర్..! తరచుగా ఈ 5 ఆహారాలు తినడం అలవాటు చేసుకోండి..
Iron Deficiency
Follow us

|

Updated on: Sep 28, 2021 | 4:27 PM

Iron Effect: దేశంలో మూడోవంతు పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన సర్వేలో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 33 వేల మంది పిల్లలను చేర్చారు. సర్వేలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గ్రామీణ, పేద కుటుంబాల పిల్లలలో రక్తహీనత కేసులు ఎక్కువగా కనిపించాయి. దీనిని నివారించాలంటే రోజువారీ ఆహారంలో తగినంత ఐరన్‌ ఉండే విధంగా చూసుకోవాలి. లేదంటే రక్తహీనతో చాలామంది మరణించాల్సి వస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండే 5 ఆహార పదార్థాలను తరచూ తింటుండాలి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. నువ్వులలో ఇనుము, రాగి, జింక్, సెలీనియం, విటమిన్లు బి 6, ఈ, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. సుమారు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను తీసుకుని వాటిని కాల్చి పొడి చేసి, దానికి ఒక చెంచా తేనె, నెయ్యి కలిపి లడ్డు తయారు చేయాలి. ఈ లడ్డును క్రమం తప్పకుండా తీసుకుంటే మీ శరీరంలో కావలసినంత ఐరన్ ఉంటుంది.

2. ఖర్జూరా, ఎండుద్రాక్ష ప్రతిరోజూ తినండి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, రాగి, విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ప్రతిరోజు 2-3 ఖర్జురాలు, ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షను చిరుతిండిగా తీసుకోండి. తక్షణ శక్తిని పొందడానికి ఐరన్ స్థాయిలను పెంచడానికి ఇది గొప్ప చిరుతిండి.

3. బీట్‌రూట్, క్యారెట్లలో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన బీట్‌రూట్, క్యారెట్‌ను గ్లైండర్‌లో రుబ్బండి. రసాన్ని ఫిల్టర్ చేయండి. ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా ఉదయం తాగండి. విటమిన్ సితో పాటు ఐరన్ కూడా పెరుగుతుంది.

4. గోధుమ గడ్డిలో బీటా కెరోటిన్, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ఇవి శరీరంలో కొత్త రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోజూ ఉదయం 1 టీస్పూన్ గోధుమ గడ్డిని తీసుకుంటే మీ హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

5. పాలకూర, బచ్చలికూరలలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారించాలంటే ఆకుకూరలు డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే. వారంలో కనీసం రెండు సార్లయినా తినాలి.

IRCTC Tour: అందాల గోవాలో సరదాగా తిరిగివద్దామని అనుకుంటున్నారా? ఐఆర్సీటీసీ గ్లోరియస్ టూర్ ప్యాకేజీ మీకోసమే!

Health: రోజంతా హుషారుగా ఉండాలంటే జస్ట్ ఇవి చేస్తే చాలు..! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

Allu Arjun: బన్నీ సినిమాకు మరుసారి బ్రేక్ పడిందా..? కారణం అదేనా..?