AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: బన్నీ సినిమాకు మరుసారి బ్రేక్ పడిందా..? కారణం అదేనా..?

అల్లు అర్జున్.. ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. ఇక గత ఏడాది విడుదలైన అలవైకుంఠపురంలో..

Allu Arjun: బన్నీ సినిమాకు మరుసారి బ్రేక్ పడిందా..? కారణం అదేనా..?
Pushpa
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 28, 2021 | 7:01 PM

Share

Pushpa movie: అల్లు అర్జున్.. ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. ఇక గత ఏడాది విడుదలైన అలవైకుంఠపురంలో సినిమాతో కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప సినిమాతో రాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం బన్నీ ఆర్మీ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే.. ప్రతి పాటా .. ప్రతి ఫైట్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు చివారి దశకు వచ్చేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనీ చిత్రయూనిట్ భావించినప్పటికీ ఇప్పుడు అది సాధ్యపడేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం పుష్ప సినిమాను మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షాట్ చేస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా షూటింగ్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వర్షం కారణంగా షూటింగ్ జరపడం కష్టం కావడంతో షూటింగ్ ను నిపిపివేశారని తెలుస్తుంది. దాంతో సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోవచ్చు అని అంటున్నారు కొందరు విశ్లేషకులు.. ఇక ఈ సినిమాలో బోట్ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉండనుందట.. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత కొత్త రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసే అవకాశాలు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్‌గా కనిపించనున్నాడు. అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న కనిపించనుంది. అలాగే బోట్ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత కొత్త రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections: ఇది ఆత్మ గౌరవ పోరాటం, మా ఎన్నికల్లో మీరు తలదూర్చకండి.. విష్ణు షాకింగ్ కామెంట్స్‌..

Bigg Boss 5 Telugu: డేంజర్‏ జోన్‏లో ఆ ముగ్గురు.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా ?

Sushmita Konidela Photos: సోషల్ మీడియాలో సుస్మిత కొణిదల ఫొటోస్… వావ్ అంటున్న ఫ్యాన్స్..