Health: రోజంతా హుషారుగా ఉండాలంటే జస్ట్ ఇవి చేస్తే చాలు..! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
Interesting Facts: చాలామంది రోజు మొత్తం హుషారుగా ఉండాలని ప్రయత్నిస్తారు కానీ సాధ్యపడదు. పని ఒత్తిడి వల్ల కొద్దిసేపటికే అలసిపోతారు. కానీ రోజు మొత్తం యాక్టివ్‌గా
Interesting Facts: చాలామంది రోజు మొత్తం హుషారుగా ఉండాలని ప్రయత్నిస్తారు కానీ సాధ్యపడదు. పని ఒత్తిడి వల్ల కొద్దిసేపటికే అలసిపోతారు. కానీ రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం లేచాక కొన్ని పద్దతులను పాటించాలి. అప్పుడు అలసట అనేది మీ దరిచేరుదు. రోజు మొత్తం హుషారుగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆ టిప్స్ ఎంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. షికారుకు వెళ్లిండి.. ఉదయం నిద్రలేచిన తర్వాత కొద్దిసేపు వాకింగ్‌కి వెళ్లి సూర్యోదయాన్ని ఆస్వాదించండి. సూర్యుని సహజ కాంతి మీ శక్తిని రెట్టింపు చేస్తుంది. అంతేకాదు మీకు మంచి రిలీఫ్‌ని అందిస్తుంది. మీ మానసిక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
2. చల్లటి నీటితో స్నానం కొంతమంది స్నానం చేయడానికి చాలా చిరాకు పడుతారు. అయితే రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండాలంటే రోజు చల్లటి నీటితో స్నానం చేయాలి. కూల్ షవర్ మిమ్మల్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా నిద్ర రాకుండా చేస్తుంది.
3. పండ్లు తినాలి పండ్లు సూపర్ హెల్తీ ఫుడ్. మీరు అల్పాహారం కోసం పండ్లు తినవచ్చు. అవి మీకు శక్తిని ఇస్తాయి. మీ ముఖంలో గ్లో తీసుకువస్తాయి. ఉదయం ఖచ్చితంగా మీకు నచ్చిన పండ్లను తీసుకోవాలి. పండ్లు రోజు మొత్తం మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచే విధంగా చేస్తాయి. శరీరానికి కావల్సిన విటమిన్లు, పోషకాలను అందిస్తాయి.
4. మంచి టిఫిన్ రోజు మొత్తం హుషారుగా ఉండాలంటే మంచి బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఫుడ్ ఎంపిక చేసుకొని ఆస్వాదించండి. మంచి అనుభూతి కలుగుతుంది. ఒకవేళ మీ షెడ్యూల్ బిజీగా ఉంటే మీరు త్వరగా టిఫిన్ చేయాలి కానీ మానుకోకూడదు.
5. ఒక కప్పు టీ మీ రోజును ఒక కప్పు టీతో ప్రారంభించడం చాలా బాగుంటుంది. టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సాధారణ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. రోజంతా హుషారుగా ఉండటానికి సాయం చేస్తుంది.