AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Copper Vessel Water: రాగి పాత్రల్లో నీరు తాగుతున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి ..! లేదంటే..

అందుకే కాపర్ బాటిల్, లేదా బిందేలోంచి నీళ్లు తాగేవారు ఈ విషయాలను గుర్తుంచుకోండి. రాగి బిందేలు, బాటిళ్లలో నీటిని క్రమం తప్పకుండా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రాగి పాత్రల్లో ఆ నీటిని కనీసం 8 గంటలపాటు ఉంచాల్సి ఉంటుంది. రాగి పాత్రలో 48 గంటల పాటు నీటిని నిల్వ చేసిన నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

Copper Vessel Water: రాగి పాత్రల్లో నీరు తాగుతున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి ..! లేదంటే..
Copper Vessels Clean
Jyothi Gadda
|

Updated on: Feb 22, 2024 | 9:16 PM

Share

పూర్వం మన ఇళ్లలో తాగునీరు రాగి పాత్రలలోనే నిల్వ చేసేవారు. నిజం చెప్పాలంటే.. రాగి పాత్రలలో నింపిన నీరు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రాచీనులు చాలా కాలం క్రితమే అర్థం చేసుకున్నారు. ఆయుర్వేదం కూడా రాగి పాత్రలలో నిల్వ చేసిన నీటి ప్రయోజనాలను పేర్కొంది. అంటే ఆయుర్వేదం ప్రకారం వాత, కఫ, పిత్త దోషాల నుంచి బయటపడేందుకు రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం మంచిదని చెబుతుంటారు. కానీ నేటి కాలం మారింది. నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది ప్రజలు తాగునీటిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్, స్టీల్ లేదా గాజు సీసాలు వాడుతున్నారు. అయితే, ఆరోగ్య ప్రయోజనాల పరంగా తాగునీటిని నింపడానికి రాగి పాత్రలు అత్యంత అనుకూలమైనవే.

రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి బలపడుతుంది. ఈ నీరు బరువు తగ్గడం, కీళ్లనొప్పులు, కొలెస్ట్రాల్, అధిక బీపీకి కూడా మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాగి పాత్రలలో నీటిని దాదాపు 6 నుండి 8 గంటల పాటు ఉంచినట్లయితే, అది స్వచ్ఛమైన నీరు రూపాంతరం చెందుతుంది. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగితే కిడ్నీ, కొలెస్ట్రాల్, రక్తహీనత వంటి వ్యాధులు దరిచేరవు. అయితే, రాగి పాత్రలో నీటిని నిల్వ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు శరీరానికి మేలు చేస్తుంది. కానీ, రాగి పాత్రలో లేదా సీసాలో నిల్వ ఉంచిన నీటిని తాగేటప్పుడు మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ తప్పులు బహుశా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. శరీరంలోని రాగి స్థాయిలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. అందుకే కాపర్ బాటిల్, లేదా బిందేలోంచి నీళ్లు తాగేవారు ఈ విషయాలను గుర్తుంచుకోండి. రాగి బిందేలు, బాటిళ్లలో నీటిని క్రమం తప్పకుండా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రాగి పాత్రల్లో ఆ నీటిని కనీసం 8 గంటలపాటు ఉంచాల్సి ఉంటుంది. రాగి పాత్రలో 48 గంటల పాటు నీటిని నిల్వ చేసిన నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

ఉదయం పూట ఖాళీ కడుపుతో రాగిబిందేలోంచి నీళ్లు తాగాలి. అన్నం తిన్న తర్వాత రాగి పాత్రల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఖాళీ కడుపుతో రాగి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే, మీరు ఒక రోజంతా రాగి సీసా లేదా కంటైనర్‌లో నిల్వ చేసిన నీటిని తాగితే, అది మీ శరీరంలో రాగి పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది తీవ్రమైన వికారం, మైకము, పొత్తికడుపు నొప్పిని కలిగిస్తుంది. కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. రాగిని ఎక్కువగా నీటిలో కలిపితే, అది దుష్ప్రభావాలకు దారితీస్తుంది.

ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు, తెనే కలుపుకుని తాగుతారు. కానీ రాగి గ్లాసులో అలాంటి నీటిని ఎప్పుడూ తాగకూడదు. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే యాసిడ్ రాగితో ప్రతిచర్య జరుపుతుంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలా మంది నిద్రపోయే ముందు నేలపై రాగి పాత్రను ఉంచుతారు. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీటిని తాగుతారు. ఇలా తాగడం హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాగి నీటిని నేలపై పెట్టి తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

అలాగే, రాగి పాత్రలు,సీసాలు ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటితో కడగాలి. అలాగే, ప్రతి 30 రోజులకు ఒకసారి ఈ బాటిళ్లను ఉప్పు, నిమ్మకాయతో బాగా శుభ్రం చేయండి. ఇది ఆక్సీకరణ మరకను నివారిస్తుంది. నీటిని నిల్వ చేసే ఏదైనా రాగి పాత్రలో సహజ ఆక్సీకరణ ప్రక్రియ జరుగుతుంది. సహజ ఆక్సీకరణ చాలా త్వరగా జరిగితే, రాగి సీసా లక్షణాలు తగ్గుతాయని కూడా గమనించాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us