Ash Gourd Juice: బూడిద గుమ్మడిలో బోలెడు ఔషధ గుణాలు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఈ సమస్యలు పరార్..!

బూడిద గుమ్మడి రసం మీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. అవసరమైన విటమిన్లతో నిండిన ఈ రసం రక్తంలోని చక్కెరను తగ్గించడానికి గొప్ప ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే, శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో బూడిద గుమ్మడి రసం కీలకపాత్ర పోషిస్తుంది.

Ash Gourd Juice: బూడిద గుమ్మడిలో బోలెడు ఔషధ గుణాలు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఈ సమస్యలు పరార్..!
Ash Gourd
Follow us

|

Updated on: Feb 22, 2024 | 8:11 PM

ప్రతి రోజూ ఉదయాన్నే చాలా మంది ఆరోగ్యానికి హాని చేసే కెఫైన్ సంబంధిత పానీయాలు తాగుతున్నారు. కానీ, ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పానీయాలను చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో హెర్బల్ వాటర్, స్పైస్ వాటర్ ప్రధానంగా చెప్పుకొవాలి. అయితే బూడిద గుమ్మడి జ్యూస్ కూడా పరగడుపునే తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా..? అవున మీరు విన్నది నిజమే.. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

బూడిద గుమ్మడి కాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో విషవ్యర్థాలను బయటకు తొలగించడంలో ఈ జ్యూస్‌ తోడ్పడుతుంది. ఇది దాహాన్ని తీరుస్తుంది. బూడిద గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్నీ డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నీటిశాతం కూడా పుష్కలంగా ఉంటుంది. దీని రసం తాగితే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సమ్మర్ ఫుడ్స్‌లో బూడిద గుమ్మడిని కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆల్కలీన్ ఫుడ్ కావడం వల్ల హానికరమైన రసాయనాల ప్రభావాలను తటస్థీకరిస్తుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడి రసాన్ని తాగితే మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా కడుపులో ఉన్న టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మంచి జీర్ణ క్రియను పోషిస్తుంది. ఇది పేగు కదలికలను, జీర్ణ ఎంజైమ్‌ల విడుదలను ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా ఇది మీలో pH స్థాయిని అదుపులో ఉంచుతుంది. దానివల్ల ఎసిడిటీ, అల్సర్ల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

బూడిద గుమ్మడి రసం మీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. అవసరమైన విటమిన్లతో నిండిన ఈ రసం రక్తంలోని చక్కెరను తగ్గించడానికి గొప్ప ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే, శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో బూడిద గుమ్మడి రసం కీలకపాత్ర పోషిస్తుంది. బ్రోన్కైటిస్, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల్లో చికిత్సకు సాంప్రదాయ వైద్యంలో బూడిద పొట్లకాయ రసాన్ని ఉపయోగిస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్