Seema Style Mutton Vepudu: సీమ స్టైల్ మటన్ వేపుడు.. అద్భుతం అంతే!
నాన్ వెజ్ ప్రియులకు బాగా ఇష్టమైన వాటిల్లో మటన్ కూడా ఒకటి. మటన్ బిర్యానీ, మటన్ వేపుడు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే బయట రెస్టారెంట్స్ అండ్ హోటల్స్‌లో ఎలా తయారు చేస్తారో తెలీక.. చాలా మంది తినరు. ఇంట్లో చేద్దాం అంటే వండటం రాదు. ఆయిల్‌లో ఫ్రై చేస్తే.. మటన్ వేపుడు అయిపోదు. ఒక పద్దతిలో చేస్తే టేస్టీగా, స్పైసీగా వస్తుంది. అయితే ఎప్పుడూ తినే వేపుడు కాకుండా.. ఇలా సీమ స్టైల్‌లో మటన్ వేపుడు ఒక్కసారి తినండి. మళ్లీ చేసుకుని తింటారు. అలాగే ఈ ఫ్రై దాదాపు మూడు రోజుల..
నాన్ వెజ్ ప్రియులకు బాగా ఇష్టమైన వాటిల్లో మటన్ కూడా ఒకటి. మటన్ బిర్యానీ, మటన్ వేపుడు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే బయట రెస్టారెంట్స్ అండ్ హోటల్స్‌లో ఎలా తయారు చేస్తారో తెలీక.. చాలా మంది తినరు. ఇంట్లో చేద్దాం అంటే వండటం రాదు. ఆయిల్‌లో ఫ్రై చేస్తే.. మటన్ వేపుడు అయిపోదు. ఒక పద్దతిలో చేస్తే టేస్టీగా, స్పైసీగా వస్తుంది. అయితే ఎప్పుడూ తినే వేపుడు కాకుండా.. ఇలా సీమ స్టైల్‌లో మటన్ వేపుడు ఒక్కసారి తినండి. మళ్లీ చేసుకుని తింటారు. అలాగే ఈ ఫ్రై దాదాపు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాబట్టి.. ఒకటేసారి తినని వాళ్లు తర్వాత కూడా తినొచ్చు. మరి ఈ సీమ స్టైల్ మటన్ వేపుడు ఎలా చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సీమ స్టైల్ మటన్ వేపుడికి కావాల్సిన పదార్థాలు:
మటన్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తి మీర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఆయిల్.
సీమ స్టైల్ మటన్ వేపుడు తయారీ విధానం:
ఈ మటన్ వేపుడు చేసుకోవాలంటే.. లేత మటన్ తెచ్చుకోవాలి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపి మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని రాత్రంతా మ్యారినేట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కుదరని వారు సుమారు 3 గంటలైనా పక్కకు ఉంచాలి. ఆ తర్వాత మ్యారినేట్ మటన్‌ని కుక్కర్‌లో వేసి, వాటర్ కూడా వేసి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉంచాలి.
కుక్కర్ వేడి తగ్గాక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని.. ఇందులో కరివేపాకు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి.. పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత కుక్కర్‌లో ఉడికించుకున్న మటన్ వేసి.. నీరు ఇగురు పోయేంత వరకు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకుని.. ఆరగించడమే.