AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Kheer: యాపిల్‌తో పాయసం.. టేస్ట్‌తో పాటు హెల్త్‌ కూడా మీ సొంతం..

ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని అంటూ ఉంటారు. ఇది నిజమే. యాపిల్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి. పెద్దలకే కాదు పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ కొంత మంది పిల్లలు యాపిల్ అంటే అస్సలు నచ్చదు. బలవంతం చేసినా తినరు. కానీ ఈ యాపిల్‌తో పాయసంగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకు యాపిల్ పాయసం చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఆరోగ్యంతో పాటు వారికి టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో నట్స్ కూడా..

Apple Kheer: యాపిల్‌తో పాయసం.. టేస్ట్‌తో పాటు హెల్త్‌ కూడా మీ సొంతం..
Apple Kheer
Chinni Enni
| Edited By: |

Updated on: Aug 03, 2024 | 8:00 PM

Share

ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని అంటూ ఉంటారు. ఇది నిజమే. యాపిల్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి. పెద్దలకే కాదు పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ కొంత మంది పిల్లలు యాపిల్ అంటే అస్సలు నచ్చదు. బలవంతం చేసినా తినరు. కానీ ఈ యాపిల్‌తో పాయసంగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకు యాపిల్ పాయసం చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఆరోగ్యంతో పాటు వారికి టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో నట్స్ కూడా యాడ్ చేసుకుంటే మరింత హెల్దీ రెసిపీ అవుతుంది. మరి యాపిల్ ఖీర్ ఎలా తయారు చేసుకుంటారు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

యాపిల్ ఖీర్‌కు కావాల్సిన పదార్థాలు:

యాపిల్, నెయ్యి, నట్స్, యాలకుల పొడి, పంచదార, పాలు, కండెన్స్‌డ్ మిల్క్.

యాపిల్ ఖీర్‌ తయారీ విధానం:

యాపిల్ ఖీర్ తయారు చేయాలంటే.. ముందుగా పాలు వేడి చేయాలి. మీడియం మంటపై పాలు సగం అయ్యేంత వరకూ మరిగించాలి. ఇలా పాలు చిక్కగా అయ్యేలా చేయాలి. ఇలా చిక్కగా మరిగిన పాలల్లో యాలకుల పొడి, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసి కలపాలి. ఆ తర్వాత కండెన్స్‌డ్ మిల్క్ వేసి బాగా కలపాలి. దీంతో ఇది మందంగా మారుతుంది. ఓ రెండు నిమిషాలు ఉడికించి.. తురిమిన యాపిల్ ముక్కలు వేసి కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత పంచదార కూడా వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి. చివరిగా ఓ రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ ఖీర్ రెడీ అయినట్టే. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడైనా తినొచ్చు. లేదా ఫ్రిజ్‌లో పెట్టి.. చల్లగా అయిన తర్వాత తినొచ్చు. వీటిని వీకెండ్స్, స్పెషల్ డేస్‌లో తయారు చేసుకుని తినొచ్చు. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా ఫాస్ట్‌గా ఈ యాపిల్ ఖీర్ తయారు చేసుకోవచ్చు. కావాలి అనుకున్న వారు సేమియా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్