AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ కూడా వస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.

Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
Kalki 2898 AD Part 2
Basha Shek
|

Updated on: May 09, 2026 | 10:03 PM

Share

2024లో విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమా వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి కల్కి పార్ట్-2 పై ఉంది. అయితే, రెండవ భాగం షూటింగ్ ప్రారంభంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ‘కల్కి 2898 AD’ చిత్రంలో దీపికా పడుకొణె హీరోయిన్ గా నటించింది. రెండవ భాగంలోనూ ఆమె పాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే కల్కి సీక్వెల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు దీపిక వెల్లడించింది. దీంతో చిత్ర బృందం మరో హీరోయిన్ ను వెతకాల్సి వచ్చింది. దీనికి తోడు బాలీవుడ్ లెజెండరీ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వయసు పైబడటంతో షూటింగ్ లో పాల్గొంటారా? లేదా? అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పుడీ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాయట. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందట. ఇక దీపిక స్థానంలో సాయి పల్లవి నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పుడున్న నివేదికల ప్రకారం, సినిమాలో ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి కానుందట. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం కంటే మరింత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

కాగా ‘కల్కి-2’ చిత్రాన్ని 2027 డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పని ఎక్కువగా ఉన్నందున, చిత్ర బృందం పోస్ట్-ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకుంది. యాస్కిన్ (కమల్ హాసన్), భైరవ (ప్రభాస్) మధ్య అసలైన పోరాటం సీక్వెల్ లోనే ఉంటుందట. ఇక అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) మరియు యాస్కిన్ ఒకరినొకరు ఎదుర్కొనే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం అమితాబ్ బచ్చన్‌కు మరీ ఎక్కువ ఇబ్బంది కలిగించకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఇక దీపిక స్థానంలో అలియా భట్ ని కూడా తీసుకునే యోచనలో ఉన్నారట మేకర్స్.ఇందుకోసం ఇప్పటకే ఆమెతో చర్చలు జరుపుతున్నారట. ప్రభాస్ సరికొత్త షెడ్యూల్ లో పాల్గొనే లోపు అలియా భట్ తో డీల్ ముగిస్తారని అంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఈ ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సంద్రాభంగా అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?