టాలీవుడ్ ఎంతో సపోర్ట్ చేస్తుంది.. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు..

Rajitha Chanti

Pic credit - Instagram

18  July 2026

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'సరైనోడు', 'ధ్రువ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్, బాలీవుడ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.  

తన వృత్తిపరమైన ఎదుగుదలకు, నటిగా ఈ స్థాయి గుర్తింపు రావడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రధాన కారణమని రకుల్ కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.

బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో ఐక్యత, పరస్పర సహకారం చాలా ఎక్కువగా ఉంటాయని.. ఎంతో సపోర్టివ్ గా ఉంటుందని అన్నారు.

టాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల మధ్య ఎంతటి గట్టి పోటీ ఉన్నప్పటికీ, తోటి నటీనటుల విజయాలను అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తారని రకుల్ పేర్కొన్నారు.

ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేస్తూ, ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబంలా బహిరంగంగా మద్దతుగా నిలుస్తుందని. పోటీని కేవలం వృత్తిపరంగానే చూస్తారని అన్నారు.

ఇదే సమయంలో ముంబయి సినీ ఇండస్ట్రీ (బాలీవుడ్) వాతావరణంపై రకుల్ ముక్కుసూటిగా స్పందించారు. బాలీవుడ్‌లో నటీనటుల మధ్య అభద్రతా భావం.. 

ఎక్కువగా కనిపిస్తుందని, అదే అక్కడ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోకపోవడానికి ప్రధాన కారణమని, బాలీవుడ్‌లో సినిమాలపై, వ్యక్తులపై నెగిటివ్ ప్రచారం ఉంటుందన్నారు.