AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL దెబ్బకు అంతా ఖాళీ.. ఎంత భయమో..?

IPL దెబ్బకు అంతా ఖాళీ.. ఎంత భయమో..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 09, 2026 | 12:43 PM

Share

ఐపీఎల్ సీజన్ టాలీవుడ్‌లో పెద్ద సినిమాల విడుదల తేదీలను మార్చేస్తోంది. క్రికెట్ సందడి కారణంగా థియేటర్లలో కలెక్షన్లు తగ్గుతాయన్న భయంతో, సమ్మర్ రిలీజ్‌లు వాయిదా పడుతున్నాయి. స్టార్ హీరోలు సైతం ఐపీఎల్‌తో పోటీ పడకుండా, టోర్నమెంట్ పూర్తయ్యాక తమ సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఇది టాలీవుడ్ మేకర్స్‌లో ఐపీఎల్ భయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

IPL సీజన్ నిజంగా సినిమా ఇండస్ట్రీని అంతగా భయపెడుతుందా..? క్రికెట్ ఉంటే మాకేంటి ఏ భయం లేదంటూనే.. మొత్తం సమ్మర్ సీజన్ అంతా ఖాళీ చేసారు హీరోలు. పైకి ఎంత కాదని చెప్తున్నా మెయిన్ రీజన్ మాత్రం IPL అని అర్థమైపోతుంది. లేటెస్ట్‌గా ఓ సినిమాను ఐపిఎల్ కారణంగానే వాయిదా వేసారు. అసలేం జరుగుతుంది టాలీవుడ్‌లో..? టాలీవుడ్ మేకర్స్‌లో ఐపీఎల్ భయం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టే ఈ సమ్మర్ సీజన్‌ను దాదాపుగా పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్‌లో డబుల్ మ్యాచుల వల్ల మ్యాట్నీ నుంచి నైట్ షోల వరకు కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం పడుతోంది. ఆ రిస్క్ ఎందుకని సేఫ్ గేమ్ ఆడుతూ వీకెండ్ వసూళ్లు పోగొట్టుకోవడం ఇష్టం లేక అందరూ వెనక్కి తగ్గుతున్నారు. వాస్తవానికి మార్చిలోనే థియేటర్లలోకి రావాల్సిన పెద్ది సినిమా అనూహ్యంగా జూన్‌కు వెళ్లిపోగా.. మరోవైపు భారీ అంచనాల మధ్య వస్తున్న ప్యారడైజ్ కూడా మార్చి 26 నుంచి ఆగస్ట్ 21కి షిఫ్ట్ అయిపోయి సమ్మర్ సీజన్‌ని పూర్తిగా స్కిప్ చేసింది. ఇక టాక్సిక్ అయితే సీన్‌లోనే కనిపించట్లేదు. ముందు మార్చి 19 అన్నారు.. తర్వాత జూన్ 4 అన్నారు.. ఇప్పుడేకంగా 2026లోనే రావట్లేదు. అఖిల్ నటిస్తున్న లెనిన్ కూడా మే 1 నుంచి జూన్ 26కి షిఫ్ట్ అయింది. ఈ సమ్మర్‌లో టాలీవుడ్ నుంచి ఏ ఒక్క స్టార్ కూడా తమ సినిమాలని రిలీజ్ చేసే ధైర్యం చేయకపోవడం చూస్తుంటే బాక్సాఫీస్‌పై క్రికెట్ ఫీవర్ ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం అయితే ఐపిఎల్ కారణంగానే మే 15 నుంచి జూన్ 19కి వాయిదా పడింది. సమ్మర్‌లో ఖచ్చితంగా నిలుస్తామని చెప్పిన చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలు కూడా సైలెంట్‌గా తప్పుకున్నారు. క్రికెట్‌తో పోటీ పడి వసూళ్లు నష్టపోవడం కంటే.. టోర్నీ పూర్తయ్యాక కూల్‌గా ప్రేక్షకుల ముందుకు రావడమే కరెక్ట్ అని మేకర్స్ అంతా ఫిక్సైపోయారు. అందుకే మే చివర్లో ఐపిఎల్ అయిపోగానే.. జూన్ నుంచి సినిమా సందడి షురూ కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇన్‌స్టాగ్రామ్ షాక్.. స్టార్స్‌కు మాస్టర్ స్ట్రోక్

వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా

ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసుకుని తిన్నారు.. ఆ తర్వాత..

మతిమరుపు… గుండెజబ్బుకు సంకేతమా ?? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు !!

TVK Vijay: మేనిఫెస్టోలోని హామీలన్నీ విజయ్ తీర్చగలడా ??

Follow Us